Ola Electric: ఓలాకు మరో షాక్.. మూడో స్థానానికి పడిపోయిన మార్కెట్ వాటా..
ABN , Publish Date - May 28 , 2025 | 07:35 PM
భారత్‌లో విద్యుత్ ద్విచక్ర వాహన మార్కెట్‌కు ఊపిరిలూదిన సంస్థ ఓలా ఎలక్ట్రిక్. ద్విచక్ర మార్కెట్లో ఓలాదే అగ్రస్థానం. అలాంటిది ఓలా క్రమంగా తన మార్కెట్ వాటాను కోల్పోతూ వస్తోంది. సర్వీసింగ్‌లో లోపాలు ఓలాకు పెద్ద దెబ్బగా మారాయి

భారత్‌లో విద్యుత్ ద్విచక్ర వాహన మార్కెట్‌కు ఊపిరిలూదిన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric). ద్విచక్ర మార్కెట్లో ఓలాదే అగ్రస్థానం. అలాంటిది ఓలా క్రమంగా తన మార్కెట్ వాటాను కోల్పోతూ వస్తోంది. సర్వీసింగ్‌లో లోపాలు ఓలాకు పెద్ద దెబ్బగా మారాయి. ఆ లోపాన్ని సరిదిద్దుకునేందుకు ఓలా ఎంతగా ప్రయత్నిస్తున్నా వినియోగదారులు ఆ సంస్థపై నమ్మకం ఉంచడం లేదు. ప్రత్యర్థి కంపెనీలైన టీవీఎస్, బజాజ్ ఈవీ (Ola EV)ల విక్రయాలు జోరందుకుంటున్నాయి. దీంతో ఓలా అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి (Business News).
పలు నియంత్రణ సంస్థల నుంచి ఓలాకు సమస్యలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వ వాహన పోర్టల్ మరో షాకింగ్ విషయం వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో 1-26 తేదీల మధ్య 15, 221 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాది ఇదే సమయంలో 37, 388 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే గతేడాది ఓలా స్కూటర్ల అమ్మకాలతో పోల్చుకుంటే ఈ ఏడాది ఓలా ఈవీ అమ్మకాల సంఖ్య ఏకంగా 60 శాతం తగ్గిపోయింది. ఇక, గతేడాది ఈ సీజన్‌కు విద్యుత్ ద్విచక్ర వాహన మార్కెట్లో ఓలా వాటా 50 శాతంగా ఉండేది. అది ప్రస్తుతం 20 శాతానికి పడిపోయింది.
2025 మే నెల నాటికి విద్యుత్ ద్విచక్ర వాహన మార్కెట్లో టీవీఎస్ మోటార్ 25 శాతం వాటాతో అగ్రగామిగా ఉంది. ఆ తర్వాత బజాజ్ ఆటో 22.6 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా ఓలా 20 శాతంతో, ఏథర్ ఎనర్జీ 13.1 శాతంతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్ను ఓవర్ టేక్ చేసిన వైనం
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్లు తయారు చేస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి