Microsoft CEO Satya Nadella: సత్య నాదెళ్ల వేతనం రూ.850 కోట్లు
ABN , Publish Date - Oct 23 , 2025 | 04:47 AM
అమెరికన్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ, తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల 2025 ఆర్థిక సంవత్సరానికి (2024 జూలై 1- 2025 జూన్ 30) రికార్డు స్థాయిలో...
2025 ఆర్థిక సంవత్సరంలో 22% పెంపు
న్యూఢిల్లీ: అమెరికన్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ, తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల 2025 ఆర్థిక సంవత్సరానికి (2024 జూలై 1- 2025 జూన్ 30) రికార్డు స్థాయిలో 9.65 కోట్ల డాలర్ల పారితోషికం అందుకున్నా రు. మన కరెన్సీలో దాదాపు రూ.850 కోట్లు. 2024 ఆర్థిక సంవత్సరంలో లభించిన 7.91 కోట్ల డాలర్లతో పోలిస్తే ఆయన వేతన ప్యాకే జీ 22ు పెరిగింది. కృత్రిమ మేధలో (ఏఐ) మైక్రోసా్‌ఫ్టను అగ్రగామిగా నిలబెట్టడంతోపాటు గడిచిన ఏడాది కాలంలో కంపెనీ అద్భుత పనితీరు కనబరచడంతో నాదెళ్ల ప్యాకేజీ కూడా గణనీయంగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ ఆదాయం 15ు పెరిగి 28,170 కోట్ల డాలర్లకు చేరగా.. నికర రాబడి 16ు వృద్ధితో 10,180 కోట్ల డాలర్లకు చేరింది. అంతేకాదు, ఈ ఏడాదిలో మైక్రోసాఫ్ట్ షేరు ధర 23ు పెరిగింది. గత ఏడాది కంపెనీ మార్కెట్ విలువ 3 లక్షల కోట్ల డాలర్ల మైలురాయికి చేరింది. యాపిల్ తర్వాత ఈ స్థాయి మార్కెట్ విలువను కలిగిన కంపెనీ ఇదే.
95 శాతానికి పైగా స్టాక్ కేటాయింపులే..
కంపెనీ ఫైలింగ్ ప్రకారం.. నాదెళ్ల వార్షిక పారితోషికంలో 95 శాతానికి పైగా (దాదాపు 8.42 కోట్ల డాలర్లు) పనితీరు ఆధారిత స్టాక్ కేటాయింపులే. అంటే, వ్యాపారాన్ని అనుకున్న లక్ష్యాలకు చేర్చినందుకుగాను కంపెనీ ఆయనకు కేటాయించిన షేర్ల విలువ అది. ఆయన కనీస వేతనం 25 లక్షల డాలర్లుగా ఉంది. మరో 0.95 కోట్ల డాలర్లు నగదు బోనస్, 1.96 లక్షల డాలర్లు ఇతర ప్రయోజనాల రూపంలో లభించాయి.
2014లో సారథ్య బాధ్యతలు
మైక్రోసాఫ్ట్ సీఈఓగా 2014లో నాదెళ్ల కంపెనీ పగ్గాలు చేపట్టారు. గడిచిన దశాబ్దానికి పైగా కాలంలో కంపెనీ పనితీరు, వ్యాపారంతో పాటు ఆయన పారితోషికం కూడా గణనీయంగా పెరుగుతూ వచ్చింది. 2015లో ఆయన వేతన ప్యాకేజీ కేవలం 1.8 కోట్ల డాలర్లు. 2022లో 5.5 కోట్ల డాలర్లకు పెరిగింది. 2025లో దాదాపు 10 కోట్ల డాలర్లకు చేరువైంది.