Share News

Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఒక్కరోజు సంపాదన ఎంతో తెలుసా? రిలయెన్స్ అధిపతి నెట్‌వర్త్ ఎంతంటే..

ABN , Publish Date - Jul 21 , 2025 | 06:15 PM

రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ముఖేష్ అంబానీ పలు కంపెనీలను విజయవంతంగా నడిపిస్తున్నారు. ముఖేష్ సారథ్యంలోని రిలయెన్స్ పెట్రోలియం, డిజిటల్, టెలికాం, రిటైల్, ఫైనాన్స్, టెక్స్‌టైల్ రంగాల్లో అగ్రగామిగా ఎదిగింది.

Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఒక్కరోజు సంపాదన ఎంతో తెలుసా? రిలయెన్స్ అధిపతి నెట్‌వర్త్ ఎంతంటే..
Mukesh Ambani

రిలయెన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) దేశంలోనే అత్యంత సంపద కలిగిన ధనికుడు. భారత్‌లో మాత్రమే కాదు.. ఆసియాలోనే ఆయన నెంబర్ వన్ ధనవంతుడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన పలు కంపెనీలను విజయవంతంగా నడిపిస్తున్నారు. ముఖేష్ సారథ్యంలోని రిలయెన్స్ పెట్రోలియం, డిజిటల్, టెలికాం, రిటైల్, ఫైనాన్స్, టెక్స్‌టైల్ రంగాల్లో అగ్రగామిగా ఎదిగింది.


రిలయెన్స్ సంస్థ మార్కెట్ క్యాపిటల్ 19 లక్షల కోట్ల రూపాయలకు పైగానే ఉంది. తాజా త్రైమాసికంలో కూడా రిలయెన్స్ సంస్థ అద్భుత లాభాలను ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీ లాభాల్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభం ఏకంగా 76 శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో రూ. 30, 681 కోట్ల లాభాలను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ముఖేష్ సంపద మరింత పెరిగింది. త్వరలో రిలయెన్స్ సంస్థ మరిన్ని కొత్త రంగాల్లోకి కూడా అడుగుపెట్టబోతోంది.


ఫోర్బ్స్ ప్రకారం జులై 20 నాటికి ముఖేష్ అంబానీ నికర సంపద 9.10 లక్షల కోట్ల రూపాయలు. ప్రపంచ కుభేరుల జాబితాలో అంబానీ ప్రస్తుతానికి 15వ స్థానంలో ఉన్నారు. ఇండియా, ఆసియాల్లో మాత్రం ఆయనే నెంబర్ వన్. తాజా నివేదికల ప్రకారం.. ముఖేష్ అంబానీ రోజుకు రూ.163 కోట్లు సంపాదిస్తున్నారు. అంటే ఆయన ప్రతి గంటకు దాదాపు 7 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారన్నమాట. ఒక్కో నిమిషానికి దాదాపు 2.35 లక్షల రూపాయలను ఆర్జిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 21 , 2025 | 06:15 PM