Boosting Loan Growth: వడ్డీ రేట్లు మరో 0.25 శాతం తగ్గే చాన్స్
ABN , Publish Date - Aug 03 , 2025 | 05:33 AM
ఈ నెలలో నిర్వహించనున్న ద్రవ్యపరపతి విధాన సమీక్షలో భాగంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక వడ్డీ (రెపో) రేట్లను మరో 0.25 శాతం తగ్గించే అవకాశం...

ఈ నెలలో నిర్వహించనున్న ద్రవ్యపరపతి విధాన సమీక్షలో భాగంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక వడ్డీ (రెపో) రేట్లను మరో 0.25 శాతం తగ్గించే అవకాశం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ తాజా నివేదిక అంచనా వేసింది. రెపో తగ్గింపు పండగ సీజన్‌లో రుణ వృద్ధికి దోహదపడనుందని రిపోర్టు పేర్కొంది. దీపావళికి ముందు వడ్డీ రేట్లు తగ్గిన సందర్భాల్లో రుణ వృద్ధి గణనీయంగా పెరిగిందని గత గణాంకాలు సూచిస్తున్నాయని తెలిపింది.
2017 ఆగస్టులో ఆర్‌బీఐ రెపో రేటు 0.25 శాతం తగ్గించిందని, దాంతో ఆ ఏడాది దీపావళితో ముగిసిన పండగ సీజన్‌లో రూ.1.95 లక్షల కోట్ల రుణ వృద్ధి నమోదైందని, ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు 30 శాతం పుంజుకున్నాయని ఎస్‌బీఐ తన నివేదికలో ప్రస్తావించింది. పరపతి సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ నెల 4-6 తేదీల్లో సమావేశం కానుంది. సమీక్ష చివరి రోజున ఆర్‌బీఐ వడ్డీ రేట్లపై ఎంపీసీ నిర్ణయాన్ని ప్రకటించనుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్‌బాస్ అరెస్ట్ ఖాయం
Read Latest AP News and National News