Share News

Rapido Food Delivery: స్విగ్గీ, జొమాటోకు షాక్.. ఫుడ్ డెలివరీ విభాగంలోకి ర్యాపిడో..

ABN , Publish Date - Jun 09 , 2025 | 06:32 PM

బైక్, ట్యాక్సీ సర్వీసులను అందిస్తున్న ర్యాపిడో త్వరలోనే ఫుడ్ డెలివరీ విభాగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. రెస్టారెంట్ల నుంచి చాలా తక్కువ కమిషన్ తీసుకునేలా ర్యాపిడో ఫిక్స్‌డ్ కమీషన్ మోడల్‌ను అనుసరించబోతోంది. దీంతో స్విగ్గీ, జోమాటో అందోళనకు గురవుతున్నాయి.

Rapido Food Delivery: స్విగ్గీ, జొమాటోకు షాక్.. ఫుడ్ డెలివరీ విభాగంలోకి ర్యాపిడో..
Rapido food delivery

మన దేశంలో ఫుడ్ డెలివరీ విభాగంలో స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) రారాజులుగా వెలుగొందుతున్నాయి. ఈ విభాగంలోకి ప్రవేశించడానికి మరికొన్ని సంస్థలు ప్రయత్నించినప్పటికీ నిలదొక్కుకోలేకపోయాయి. ఆయా సంస్థల వైపు రెస్టారెంట్లు మొగ్గు చూపకపోవడంతో అవి విఫలమయ్యాయి. అయితే బైక్, ట్యాక్సీ సర్వీసులను అందిస్తున్న ర్యాపిడో (Rapido) త్వరలోనే ఫుడ్ డెలివరీ విభాగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది.


రెస్టారెంట్ల నుంచి చాలా తక్కువ కమిషన్ తీసుకునేలా ర్యాపిడో ఫిక్స్‌డ్ కమీషన్ మోడల్‌ను అనుసరించబోతోంది. దీంతో స్విగ్గీ, జోమాటో అందోళనకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు సంస్థల షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. స్విగ్గీ, జొమాటో సంస్థలు ప్రస్తుతం హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి 16-30 శాతం కమీషన్ తీసుకుంటున్నాయి. అయితే ర్యాపిడో మాత్రం 8-15 శాతం కమీషన్‌ను మాత్రమే తీసుకునేందుకు హోటళ్లు, రెస్టారెంట్లతో ఒప్పందం కుదుర్చుకుందట.


జులై నెల నుంచి బెంగళూరులో ర్యాపిడో ఫుడ్ డెలివరీ సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభం కాబోతున్నాయట. రూ.400 లోపు ఆర్డర్లపై రూ.25, రూ.400 పైబడిన ఆర్డర్లపై రూ.50 కమీషన్‌గా తీసుకునేందుకు ర్యాపిడో ఒప్పందం కుదుర్చుకుందట. ప్రస్తుతం బైక్, ట్యాక్సీ సర్వీసులను అందిస్తున్న ర్యాపిడో యాప్‌లోనే రెస్టారెంట్ల లిస్ట్ కూడా కనిపించనుందట. ర్యాపిడో రాకతో ఫుడ్ డెలివరీ విభాగంలో జొమాటో, స్విగ్గీ ఆధిపత్యానికి తెరపడనుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


ఇవీ చదవండి:

రెస్టారెంట్‌లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు

ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 09 , 2025 | 06:32 PM