Hyderabad Store Launch: విస్తరణ బాటలో రంగీతా
ABN , Publish Date - Aug 02 , 2025 | 03:24 AM
స్నాప్‌డీల్ మాతృసంస్థ ఏస్‌వెక్టర్‌కు చెందిన స్టెల్లారో బ్రాండ్స్... ఎథ్నిక్ వేర్ బ్రాండ్ రంగీతా హైదరాబాద్‌లో

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్నాప్‌డీల్ మాతృసంస్థ ఏస్‌వెక్టర్‌కు చెందిన స్టెల్లారో బ్రాండ్స్... ఎథ్నిక్ వేర్ బ్రాండ్ రంగీతా హైదరాబాద్‌లో తన కార్యకలాపాలు విస్తరించింది. ఇందులో భాగంగా మౌలాలిలో కొత్త స్టోర్‌ను ప్రారంభించినట్లు స్టెల్లారో బ్రాండ్స్ సీఈఓ హిమాన్షు చక్రవర్తి తెలిపారు. కాగా కంపెనీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 7 స్టోర్లను నిర్వహిస్తోందన్నారు. కార్యకలాపాల విస్తరణలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని ద్వితీయ, తృతీ య శ్రేణి పట్టణాల్లో కొత్తగా ఏడు షోరూమ్స్‌ను ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు చక్రవర్తి చెప్పారు.