Share News

Buyout Offer: రూ. 1600 కోట్లకు పైగా బై అవుట్ ఆఫర్‌.. క్యూకట్టిన ఉద్యోగులు

ABN , Publish Date - Nov 12 , 2025 | 04:39 PM

వర్క్ ఫ్రం హోం పద్దతిలో పనిచేయడం ఉద్యోగుల మీద ఎంత ప్రభావం చూపుతుందో తెలిపే సందర్భమిది. ఇక నుంచి ఆఫీస్ కు వచ్చి పనిచేయండి లేదంటే బై అవుట్ ఆఫర్ అందుకుని వెళ్లిపోండి అని కంపెనీ ప్రకటించిందో లేదో.. ఏకంగా ఆరు వందల మంది ఉద్యోగులు..

Buyout Offer: రూ. 1600 కోట్లకు పైగా  బై అవుట్ ఆఫర్‌..  క్యూకట్టిన ఉద్యోగులు
Paramount Skydance

ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్ సమయంలో కల్పించిన వర్క్ ఫ్రం హోం వెసులుబాటును ఇప్పుడు చాలా కంపెనీలు వెనక్కితీసుకుంటున్నాయి. ఆఫీసులకు వచ్చి పనిచేయాలని ఉద్యోగులకు సూచిస్తున్నాయి. ఇదే తరహాలో అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ పారామౌంట్ స్కైడాన్స్‌ తన ఎంప్లాయిస్‌కు ఆదేశించింది.


వారంలో ఐదు రోజులు ఆఫీస్‌లకు రావాలని.. లేకపోతే బై అవుట్ ప్యాకేజీ తీసుకోవాలని పారామౌంట్ స్కైడాన్స్‌ ఉద్యోగులకు కంపెనీ సీఈవో మెయిల్స్ పంపించారు. అదే సమయంలో ఆఫీసుల్లో ఉద్యోగుల ప్రత్యక్ష అవసరాన్ని, ఆవశ్యకతను నొక్కి చెప్పారు. పాత పద్దతిలో పనిచేయడం కంపెనీకి లాభదాయమని తెలిపారు.


అయితే, దీనిపై అమెరికాలోని లాస్ ఏంజెలిస్, న్యూయార్క్‌ ఆఫీసుల్లో పనిచేస్తున్న పారామౌంట్ కంపెనీ ఉద్యోగులు అనూహ్యంగా స్పందించారు. దాదాపు 600 మంది ఉద్యోగులు ఉన్నఫళంగా తమ జాబ్స్‌కు రాజీనామా చేసి, కంపెనీ అందించిన బై అవుట్ ఆఫర్ స్వీకరించి తప్పుకున్నారు.


వైస్ ప్రెసిడెంట్ స్థాయి, అంతకంటే తక్కువ లెవెల్ ఉద్యోగుల్లో చాలా మంది తమ ఉద్యోగాలికి రాజీనామాలు ఇచ్చారు. సంస్థను వదిలి వెళ్లిన ఉద్యోగులకు సెవరెన్స్ ప్యాకేజీ అందించడం వల్ల సంస్థకు సుమారు 185 మిలియన్ డాలర్లు (రూ. 1600 కోట్లు)కుపైనే ఖర్చైంది. కాగా, 2025 ఆగస్టులో పారామౌంట్, స్కైడాన్స్ మీడియా విలీనం తర్వాత డేవిడ్ ఎల్లిసన్.. కంపెనీ నాయకత్వ బాధ్యతలు చేపట్టి అనేక మార్పులు తీసుకొస్తున్నారు.


ఇవీ చదవండి:

మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలో తోడేలును 9 సెకెన్లలో కనిపెట్టండి..


మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..

Updated Date - Nov 12 , 2025 | 04:57 PM