Ola Electric shares: భారీగా పతనమవుతున్న ఓలా షేర్లు.. ఏడాది కనిష్టానికి చేరిక.. కారణం ఇదే..
ABN , Publish Date - Mar 17 , 2025 | 08:33 PM
కొన్ని రోజులుగా ఓలా షేర్ ధరలు పతనమవుతూనే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజే ఓలా షేర్లు 7 శాతం మేర పడిపోయాయి. దీంతో ఓలా సంస్థ షేర్ ధర సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి 46.93గా ఉంది. గత మూడు నెలల్లో 50 శాతానికి పైగా ఓలా షేర్ పడిపోయింది.

ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా (Ola) షేర్లు 52 వారాల కనిష్టానికి చేరుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఓలా షేర్ ధరలు పతనమవుతూనే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజే ఓలా షేర్లు 7 శాతం మేర పడిపోయాయి. దీంతో ఓలా సంస్థ షేర్ ధర సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి 46.93గా ఉంది. గత మూడు నెలల్లో 50 శాతానికి పైగా ఓలా షేర్ పడిపోయింది. సంస్థను వరుస వివాదాలు చుట్టుముడుతుండడమే షేర్ పతనానికి కారణం (Ola Electric shares).
గతంలో ఓలా స్కూటర్ల సర్వీస్ విషయంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ అనుబంధ సంస్థ అయిన ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై దివాళా పిటిషన్ దాఖలైంది. కంపెనీ రిజిస్ట్రేషన్ సర్వీస్ ప్రొవైడర్ రోస్మెర్టా డిజిటల్ సంస్థ ఓలాపై బెంగళూరులోని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ముందు దివాళా పిటిషన్ వేసింది. తమకు చెల్లింపులు చేయడంలో ఓలా సంస్థ విఫలమైందని సదరు సంస్థ పేర్కొంది. ఈ పిటిషన్ గురించి ఓలా సంస్థ సెబీకి అందించిన రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా తెలిపింది. ఆ ఆరోపణలను ఖండించింది.
ఓలా సంస్థపై వస్తున్న వరుస వివాదాలు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పోగొడుతున్నాయి. ఇప్పటివరకు లాభాల్లోకి రాలేకపోయిన ఓలా సంస్థ ఇటీవల పలు నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. పలువురు ఉద్యోగులను తొలగించింది. తన మార్కెట్ వాటాను నిలుపుకుంటూ లాభాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో దాఖలైన దివాళా పిటిషన్ ఓలాను పెద్ద దెబ్బ కొట్టింది.
ఇవి కూడా చదవండి..
Stock Market: లాభాలతో ముగిసిన మార్కెట్లు.. 340 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..
Gold Silver Rates Today: గుడ్ న్యూస్..రెండో రోజు కూడా తగ్గిన బంగారం, వెండి ధరలు..
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..