Train Passengers: రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. మే 1 నుంచి కొత్త రూల్..
ABN , Publish Date - Apr 28 , 2025 | 07:50 PM
Waiting Ticket Passengers: అలాంటి వారికి ఫైన్ వేయడానికి లేదా వారిని జనరల్ బోగీకి పంపడానికి టీటీఈ పూర్తి హక్కు ఉంటుంది. దీనిపై నార్త్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కెప్టెన్ శశి కిరణ్ మాట్లాడుతూ.. ‘ టికెట్ కన్ఫార్మ్ అయిన ప్రయాణికుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవడానికి ఈ మార్పు తీసుకువచ్చాం

ఇండియన్ రైల్వే తమ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఓ కొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది. మే 1వ తారీఖు నుంచి అమల్లోకి రానున్న ఆ రూలుతో కోట్లాది మంది రైల్వే ప్రయాణికులకు ఇబ్బంది తప్పదని చెప్పొచ్చు. కొత్త రూలు ప్రకారం.. వెయిటింగ్ లిస్ట్‌లో టికెట్లు ఉన్న వారు స్లీపర్ లేదా ఏసీ కోచుల్లో ప్రయాణించడానికి వీలు లేదు. వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్నవారు కేవలం జనరల్ బోగీల్లో మాత్రమే ప్రయాణించాలి. ఐఆర్టీసీ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు కొన్న వారికి వెయిటింగ్ లిస్ట్ వస్తే.. అది ఆటోమేటిక్‌గా క్యాన్సల్ అయిపోతుంది. అయితే.. రైల్వే కౌంటర్ల ద్వారా టెకెట్లు కొంటే మాత్రం..
టికెట్ వెయిటింగ్ లిస్టులో పడిపోతుంది. ఈ నేపథ్యంలో వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న వారు స్లీపర్ లేదా ఏసీ కోచుల్లో ప్రయాణిస్తున్నారు. మే 1వ తేదీనుంచి వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్నవారు స్లీపర్ లేదా ఏసీ కోచుల్లో ప్రయాణించటం నిషిద్ధం. ఒకవేళ వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో స్లీపర్ లేదా ఏసీ కోచుల్లో ప్రయాణిస్తూ దొరికిపోతే.. అలాంటి వారికి ఫైన్ వేయడానికి లేదా వారిని జనరల్ భొగీకి పంపడానికి టీటీఈకి పూర్తి హక్కు ఉంటుంది. దీనిపై నార్త్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కెప్టెన్ శశి కిరణ్ మాట్లాడుతూ.. ‘ టికెట్ కన్ఫార్మ్ అయిన ప్రయాణికుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవడానికి ఈ మార్పు తీసుకువచ్చాం.
వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న వారి కారణంగా టికెట్ కన్ఫార్మ్ అయిన ప్రయాణికులు ఇబ్బంది పడకూడదు. వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న వారు కొన్ని సార్లు స్లీపర్, ఏసీ కోచుల్లోకి చొరబడుతున్నారు. టికెట్ కన్ఫార్మ్ అయిన ప్రయాణికుల సీట్లలో బలవంతంగా కూర్చొంటున్నారు. దాని వల్ల అందరికీ ఇబ్బంది అవుతోంది. వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న వారి సంఖ్య పెరిగితే.. భోగిలో అటు, ఇటు తిరగడానికి కూడా లేకుండా అవుతోంది. వెయిటింగ్ లిస్టు టికెట్లతో మీరు ప్రయాణిస్తున్నట్లయితే.. ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుని రైలు ఎక్కండి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
AP Government: 10 జిల్లాలకు సంబంధించి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం
Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే