New Money Rules: మారనున్న రూల్స్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ABN , Publish Date - Jun 29 , 2025 | 03:51 PM
New Money Rules: ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లేదా ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా తత్కాల్ టికెట్స్ బుకింగ్ చేసుకోవాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరికానుంది. జులై 15వ తేదీనుంచి వన్ టైమ్ పాస్‌వర్డ్ తప్పనిసరి అవ్వనుంది.

జులై 1వ తేదీనుంచి మనీ రూల్స్ మారనున్నాయి. యూపీఐ చార్జ్ బ్యాక్, ఆధార్ - పాన్, తత్కాల్ టికెట్స్ బుకింగ్ రూల్స్ మారనున్నాయి. పాన్ కార్డు తీసుకోవడానికి.. తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఆధార్ తప్పనిసరి కానుంది. జులై 1వ తేదీనుంచి అమలుకానున్న కొత్త రూల్స్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
యూపీఐ చార్జ్ బ్యాక్ రూల్స్
నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ చార్జ్ బ్యాక్ రూల్స్‌లో మార్పులు తీసుకురానుంది. ఇప్పటి వరకు చార్జ్ బ్యాక్ రిక్వెస్ట్ తిరస్కరణకు గురైతే బ్యాంకు ఏన్‌పీసీఐని సంప్రదించాల్సి వస్తోంది. అయితే, జులై 1వ తేదీ నుంచి ఏన్‌పీసీఐ జోక్యం ఉండదు. ఏన్‌పీసీఐ ఆమోదం లేకుండానే బ్యాంకులు చార్జ్ బ్యాక్‌ను ప్రాసెస్ చేయనున్నాయి.
పాన్‌కు ఆధార్ తప్పని సరి..
జులై ఒకటవ తేదీనుంచి కొత్త పాన్ కార్డు కోసం ఆధార్ కార్డు తప్పని సరికానుంది. పాన్ కార్డు తీసుకోవాలంటే.. ఆధార్ వెరిఫికేషన్ తప్పని సరి అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) స్పష్టం చేసింది.
తత్కాల్ టికెట్ బుకింగ్ ..
జులై 1వ తేదీ నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్స్ రూల్స్‌లో మార్పులు రానున్నాయి. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లేదా ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా తత్కాల్ టికెట్స్ బుకింగ్ చేసుకోవాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పని సరికానుంది. జులై 15వ తేదీనుంచి వన్ టైమ్ పాస్‌వర్డ్ తప్పని సరి అవ్వనుంది. టికెట్లు బుకింగ్ చేసుకునే సమయంలో ప్రయాణికుల ఫోన్లకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తేనే టికెట్లు బుక్ అవుతాయి.
బుకింగ్ విండో ఓపెన్ అయిన 30 నిమిషాల్లోనే టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏసీ క్లాస్ తత్కాల్ టికెట్లు ఉదయం 10 నుంచి 10.30 వరకు మాత్రమే బుక్ చేసుకోవాలి. నాన్ ఏసీ తత్కాల్ టికెట్లు 11 నుంచి 11.30 వరకు మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
ఆస్తి కోసం 45 ఏళ్ల వ్యక్తికి ట్రాప్.. పెళ్లైన గంటల్లోనే..
వర్షాకాలంలో మొక్కలను ఎలా సంరక్షించాలో తెలుసా..