హాయర్ ఇండియాపై అంబానీ ఆసక్తి
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:39 AM
హాయర్ ఇండియాలో వాటా కొనుగోలు చేసేందుకు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) కూడా బరిలోకి దిగినట్లు తెలిసింది. చైనాకు చెందిన కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్...

రేసులో సునీల్ మిట్టల్, బర్మన్లు సైతం..
న్యూఢిల్లీ: హాయర్ ఇండియాలో వాటా కొనుగోలు చేసేందుకు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) కూడా బరిలోకి దిగినట్లు తెలిసింది. చైనాకు చెందిన కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం హాయర్ భారత అనుబంధ విభాగమే హాయర్ ఇండియా. ప్రస్తుతం హాయర్ తన భారత వ్యాపారంలో స్థానిక భాగస్వామిని చేర్చుకునేందుకు 51 శాతం వరకు వాటా విక్రయించాలని చూస్తోంది. ఈ డీల్‌లో భాగంగా కంపెనీ విలువను 200-230 కోట్ల డాలర్ల (రూ.17,000 -19,550 కోట్లు) స్థాయిలో లెక్కగట్టే అవకాశం ఉంది. కాగా, హాయర్ ఇండియాలో వాటాను దక్కించుకునేందుకు అంబానీతో పాటు భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్‌సునీల్ మిట్టల్, డాబర్ ప్రమోటర్లైన బర్మన్ల కుటుంబం, అమిత్ జాతియా, బీకే గోయెంకా కూడా పోటీలో ఉన్నట్లు సమాచారం. టీవీ, ఏసీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, వాటర్ హీటర్, మైక్రోవేవ్ ఓవెన్ తదితర ఉత్పత్తులను విక్రయిస్తున్న హాయర్ ఇండియా గత ఏడాది రూ.8,900 కోట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ ఏడాదిలో విక్రయాలు రూ.11,500 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇవి కూడా చదవండి
Live In Partner: పదేళ్ల సహజీవనం.. బెడ్డు కింద ప్రియురాలి శవం..
అడిగినంత పనీర్ వేయలేదని పెళ్లి మండపంలో దారుణం..