LTCG ITR-1 ITR-4: పన్ను చెల్లింపుదార్లకు అలర్ట్.. ఎల్టీసీజీ రూ.1.25 లక్షల లోపు ఉంటే
ABN , Publish Date - May 01 , 2025 | 12:17 PM
ఎల్టీసీజీ రూ.1.25 లోపు ఉన్న వారు ఐటీఆర్-1,4 ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయొచ్చని సీటీబీటీ తాజాగా పేర్కొంది. అయితే, ఇది సెక్షన్ 112ఏ పరిధిలోని ఎల్సీటీజీకే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: మీరు పన్ను చెల్లిస్తుంటారా? షేర్లు అమ్మితే లాభాలు వచ్చాయా? అయితే, మీకో గుడ్ న్యూస్! రూ.1.25 లక్షల లోపు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ.. షేర్లు, వంటివి విక్రయించగా వచ్చిన లాభం) ఉన్న వారు ఇకపై ఐటీఆర్-1 (సహజ్) లేదా ఐటీఆర్-4 (సుగమ్) ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయొచ్చని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీటీబీటీ) తాజాగా వెల్లడించింది.
ఇప్పటివరకూ ఎల్టీజీసీ ఎంత స్వల్పంగా ఉన్నా పన్నుచెల్లింపుదార్లు సంక్లిష్టమైన ఐటీఆర్-2 ద్వారా రిటర్నులు దాఖలు చేయాల్సి వచ్చేది. దీంతో, చిన్న మదుపర్లు, జీతాలు పొందే ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
ఇక వార్షిక ఆదాయం 50 లక్షల లోపు ఉన్నవారికి మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని సీటీబీటీ పేర్కొంది. సెక్షన్ 112ఏ పరిధిలోని ఎల్టీసీజీ అంటే.. ఈక్విటీ షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, బిజినెస్ ట్రస్ట్స్ యూనిట్స్, ఇతరత్రా విక్రయాలపై వచ్చిన లాభాలకే ఇది వర్తిస్తుందని వెల్లడించింది.
సీటీబీటీ ప్రకటన ప్రకారం, ఎల్టీసీజీ రూ.1.25 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఎప్పటిలాగే ఐటీఆర్-2 లేదా ఐటీఆర్ -3 రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్, స్థిరాస్థుల అమ్మకం ద్వారా లాభాలు, గతేదాడి నష్టాలను క్యారీ ఫార్వర్డ్ చేసిన సందర్భాల్లోనూ యథాప్రకారం మునుపటి పద్ధతిలోనే ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఈ నిర్ణయంతో చిన్న మదుపర్లు, ఉద్యోగులకు మేలు చేకూరనుంది. ఐటీఆర్ ఫైలింగ్ సులభతరం కానుంది. తాజా నిర్ణయంతో పన్ను చెల్లింపుదార్లపై భారం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు, చిన్న వ్యాపారులు స్వచ్ఛదంగా పన్ను చెల్లించేందుకు ప్రోత్సాహకంగా ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి సడలింపులు కారణంగా ఐటీఆర్ ఫైలింగ్‌లో పొరపాట్లు కూడా తగ్గుతాయని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
పెరిగిన ఏటీఎమ్ విత్‌డ్రా చార్జీలు.. నేటి నుంచి కొత్త రూల్స్
నా కూతురు డబ్బులు అడుగుతుందనుకుని కాస్త భయపడ్డా.. బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
వజ్రాలు కొంటున్నారా.. ఈ విషయాల్లో జాగ్రత్త
గోల్డ్ కాయిన్స్ కొనాలా లేదా బంగారు నగలు కొనాలా అని డౌటా? అయితే..
Read More Business News and Latest Telugu News