Sstock Market: 7 నుంచి జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఐపీఓ
ABN , Publish Date - Aug 03 , 2025 | 05:41 AM
ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 7న ప్రారంభమై 11న ముగియనుంది. ఐపీఓ ద్వారా నిధుల సమీకరణ...

రూ.3,600 కోట్లకు తగ్గిన నిధుల సమీకరణ లక్ష్యం
ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 7న ప్రారంభమై 11న ముగియనుంది. ఐపీఓ ద్వారా నిధుల సమీకరణ లక్ష్యాన్ని మాత్రం కంపెనీలో గతంలో నిర్దేశించుకున్న రూ.4,000 కోట్ల నుంచి రూ.3,600 కోట్లకు తగ్గించుకుంది. ఐపీఓలో భాగంగా రూ.1,600 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేయడంతో పాటు ప్రస్తుత వాటాదారులకు చెందిన రూ.2,000 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) పద్ధతిన విక్రయించనున్నట్లు సెబీకి సమర్పించిన రెడ్ హియరింగ్ ప్రాస్పెక్ట్‌స(ఆర్‌హెచ్‌పీ)లో కంపెనీ వెల్లడించింది. ఓఎ్‌ఫఎస్ ద్వారా ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం అపోలో మేనేజ్‌మెంట్ రూ.931.80 కోట్లు, సినర్జీ మెటల్స్ ఇన్వె్‌స్టమెంట్ హోల్డింగ్స్ రూ.938.50, ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ రూ.129.70 కోట్ల విలువైన వాటాను ఉపసంహరించుకోనున్నాయని జేఎ్‌సడబ్ల్యూ వెల్లడించింది.
ఆర్సిల్ ఐపీఓ కోసం దరఖాస్తు: అవెన్యూ క్యాపిటల్ పెట్టుబడులు కలిగిన అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ ఇండియా లిమిటెడ్ (ఆర్సిల్).. ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఐపీఓలో భాగంగా ప్రస్తుత ప్రమోటర్లు, వాటాదారులు 10.54 ఈక్విటీ కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిన విక్రయించనున్నట్లు డీఆర్‌హెచ్‌పీలో కంపెనీ పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి...
అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్‌బాస్ అరెస్ట్ ఖాయం
Read Latest AP News and National News