Share News

క్యూ1లో కొలువుల మార్కెట్‌ భళా

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:22 AM

దేశంలో ఉద్యోగ మార్కెట్‌ గాడిన పడుతోంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో తమ పోర్టల్‌లో 1.81 కోట్ల మంది...

క్యూ1లో కొలువుల మార్కెట్‌ భళా

మహిళల నుంచి భారీగా దరఖాస్తులు: అప్నా

న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగ మార్కెట్‌ గాడిన పడుతోంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో తమ పోర్టల్‌లో 1.81 కోట్ల మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం తమ రెస్యూమ్స్‌ పోస్టు చేసినట్టు ‘ఇండియా ఎట్‌ వర్క్‌- క్యూ1 2025’ పేరుతో విడుదల చేసిన ఒక నివేదికలో అప్నా జాబ్స్‌ పోర్టల్‌ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 30 శాతం ఎక్కువ. గత త్రైమాసికంలో అప్నా పోర్టల్‌కు వచ్చిన రెస్యూమ్స్‌లో 62 లక్షలు మహిళల నుంచి వచ్చాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 23 శాతం ఎక్కువ. కంపెనీలు అనుసరిస్తున్న ఫ్లెక్సిబుల్‌ వర్క్‌, నియామకాల్లో స్త్రీలకూ సమాన అవకాశాలు కల్పించడం, బీపీఓ, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌ రంగాల్లో మహిళలకు పెరుగుతున్న అవకాశాలు ఇందుకు ప్రధాన కారణం.

ఇవి కూడా చదవండి

Live In Partner: పదేళ్ల సహజీవనం.. బెడ్డు కింద ప్రియురాలి శవం..

అడిగినంత పనీర్ వేయలేదని పెళ్లి మండపంలో దారుణం..

Updated Date - Apr 29 , 2025 | 04:22 AM