Share News

Jio Hotstar Complementary Subscription: త్వరలో ఐపీఎల్ సీజన్.. హాట్‌స్టార్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ అందజేస్తున్న జీయో

ABN , Publish Date - Mar 18 , 2025 | 09:22 AM

త్వరలో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జియో సరికొత్త ప్లాన్స్, కాంప్లిమెంటరీ జియోహాట్‌ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌లతో ముందుకొచ్చింది. మరి ఆ వివరాలు ఏంటంటే..

Jio Hotstar Complementary Subscription: త్వరలో ఐపీఎల్ సీజన్.. హాట్‌స్టార్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ అందజేస్తున్న జీయో
JioHotstar Complementary Subscription IPL Season

ఇంటర్నెట్ డెస్క్: త్వరలో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో తన వియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.299 ఆపై రీచార్చ్ చేసుకున్న వారికి జియో హాట్ స్టార్ సబ్‌స్క్రీప్షన్ కాంప్లిమెంటరీగా ఇస్తున్నట్టు ప్రకటించింది. వీటితో పాటు జియో ఎయిర్‌ఫైబర్ ఫ్రీ ట్రయల్‌ను కూడా ప్రకటించింది. దీంతో, రాబోయే ఐపీఎల్ మ్యాచులు, మూవీలను వినియోగదారులు 4కే రిజల్యూషన్‌తో మొబైల్‌లో వీక్షించొచ్చు.

రిలయన్స్ అన్‌లిమిటెడ్ ఆఫర్..

రిలయన్స్ జియో ప్రకటన ప్రకారం, కొత్త జియో కస్టమర్లు రూ.299, ఆపై ప్రిపెయిడ్ ప్యాకేజీలతో రీచార్జ్ చేసుకుంటే 90 రోజుల పాటు ఉచితంగా జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు దీంతో, 4కే కంటెంట్‌ను టీవీల్లో సైతం ప్లే చేసే అవకాశం చిక్కుతుంది.


Also Read: భారత్‌లో ఏఐ హైప్‌పై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు

దీనితో పాటు 50 రోజుల జియో ఫైబర్ లేదా ఎయిర్‌ఫైబర్ ట్రయల్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ వైఫై, 800 పైచిలుకు ఓటీటీ ఛానల్స్, 11 ఓటీటీ ఆప్స్ అందిస్తోంది.

ఇక ప్రస్తుత యూజర్లు మాత్రం రూ.299 ఆపై ప్లాన్లతో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1.5జీబీ డాటా, రోజుకు 100 ఉచిత ఎస్ఎమ్ఎస్‌లు పొందొచ్చు. దీంతో, పాటు జియోక్లౌడ్, జియో టీవీ వంటివి బండల్డ్ యాప్స్‌లో భాగంగా జియో అందిస్తోంది. ఇక కొత్త వినియోగదారులు కొత్త సిమ్‌ తీసుకుని ఈ బెనిఫిట్స్‌ను ఆస్వాదించొచ్చు.


Read More: పన్ను పోటు తగ్గించే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

అయితే, ఈ ఆఫర్ మార్చి 17 నుంచి మార్చి 31 వరకరూ మాత్రమే అందుబాటులో ఉంటుందని రిలయన్స్ జియో పేర్కొంది. ఇక మార్చి 17కు ముందే రీచార్జ్ చేసుకున్న వారు రూ.100ల ప్యాక్ కొనుగోలు చేసి ఇవే ప్రయోజనాలను పొందొచ్చని వివరించింది. మార్చ్ 22 నుంచి ఐపీఎల్ మొదలు కానున్న నేపథ్యంలో రిలయన్స్ జియ ఈ ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఇక కాంప్లిమెంటరీ హాట్‌స్టార్ సబ్‌‌స్క్రిప్షన్ మాత్రం తొలి మ్యాచ్ నాటి నుంచి యాక్టివేట్ అవుతుందని సంస్థ పేర్కొంది. అయితే, వీటితో పాటు ఇతర ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో భాగంగా జియో కాంప్లిమెంటరీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందజేస్తోంది.

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 18 , 2025 | 09:26 AM