No Hiring in IT Industry: ఐటీ లో కొలువుల్లేవ్
ABN , Publish Date - Aug 04 , 2025 | 02:15 AM
దేశీయ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐటీ) సంస్థల్లో నియామకాలు పూర్తిగా నిలిచిపోయాయి. గడచిన 6-7 త్రైమాసికాలుగా పలు ఐటీ కంపెనీలు నియామకాలను దాదాపు పక్కనబెట్టినట్లు...

7 త్రైమాసికాలుగా ఇదే పరిస్థితి
రిక్రూట్‌మెంట్ సంస్థ క్వెస్ కార్ప్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐటీ) సంస్థల్లో నియామకాలు పూర్తిగా నిలిచిపోయాయి. గడచిన 6-7 త్రైమాసికాలుగా పలు ఐటీ కంపెనీలు నియామకాలను దాదాపు పక్కనబెట్టినట్లు రిక్రూట్‌మెంట్ సేవలందించే క్వెస్ కార్ప్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసే ద్వితీయ త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి కొనసాగనుందని తెలిపింది. ప్రస్తుతం ఐటీ నిపుణుల డిమాండ్‌లో దాదాపు 73 శాతం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ), నాన్ ఐటీ కంపెనీల నుంచే వస్తోంది తప్ప.. ఐటీ కంపెనీల నుంచి పెద్దగా లేదని క్వెస్ కార్ప్ సీఈఓ,ఈడీ గురుప్రసాద్ శ్రీనివాసన్ చెప్పారు. సేవలపై ఎక్కువగా ఆధారపడిన ఐటీ కంపెనీలైతే గత ఆరేడు త్రైమాసికాలుగా నియామకాలను పూర్తిగా నిలిపివేసాయని ఆయన తెలిపారు. కొన్ని ఐటీ సేవల కంపెనీలైతే ఉన్న ఉద్యోగులకే ఇక సెలవు అని చెబుతున్నాయి. జీసీసీలు, నాన్ ఐటీ కంపెనీలు కూడా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులనే ఎక్కువగా నియమించుకుంటున్నాయని శ్రీనివాసన్ తెలిపారు.
ఇతర ప్రధానాంశాలు
నియామకాలు పెంచిన తయారీ, బీఎ్‌ఫఎ్‌సఐ కంపెనీలు
కన్స్యూమర్ రిటైల్, టెలికాం కన్స్యూమర్ రంగాల్లోనూ పెరిగిన నియామకాలు
టెలికాం, ఫార్మా, రిటైల్ రంగాల్లో స్వల్పంగా తగ్గిన నియామకాలు
వృత్తి నిపుణులకు మరింత డిమాండ్
ఫార్మా, రిటైల్, ఆటో, తయారీ కంపెనీలను వెంటాడుతున్న
టారిఫ్‌ల భయం
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి