Share News

Intel LayOffs: మళ్లీ లేఆఫ్స్‌కు సిద్ధమవుతున్న ఇంటెల్.. ఈసారి ఏకంగా 25 వేల మంది..

ABN , Publish Date - Jul 25 , 2025 | 10:54 AM

ఒడిదుడుకుల్లో ఉన్న ప్రముఖ చిప్ మేకర్ ఇంటెల్ ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది. ఈసారి మరో 25 వేల మందిని తొలగించేందుకు సంస్థ రెడీ అవుతోందని అంతర్జాతీయ మార్కెట్‌లో కథనాలు వెలువడుతున్నాయి.

Intel LayOffs: మళ్లీ లేఆఫ్స్‌కు సిద్ధమవుతున్న ఇంటెల్.. ఈసారి ఏకంగా 25 వేల మంది..
Intel job cuts

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ చిప్ మేకర్ ఇంటెల్ భారీగా లేఆఫ్స్‌కు సిద్ధమవుతోంది. ఈ మారు ఏకంగా 25 వేల మందిని తొలగించేందుకు సిద్ధమవుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఏప్రిల్ 2025 నుంచి ఇప్పటివరకూ ఇంటెల్ 15 శాతం మంది (15 వేలు) ఉద్యోగులను తొలగించింది. గతేడాది కూడా 15 వేల మంది ఉద్యోగులను సాగనంపింది. ఇక లేఆఫ్స్ తప్పవని ఇంటెల్ ఇటీవల రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ప్రకటించింది.

సంస్థ క్లిష్టపరిస్థితుల్లో ఉన్న విషయాన్ని సీఈఓ లిప్ బూ టాన్ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సంస్థలో కార్యకలాపాలు మరింత సులభతరం చేసేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి దశలో బాధ్యతాయుత వైఖరిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.


ఈ నేపథ్యంలో ఇంటెల్ ఖర్చులను తగ్గించుకునేందుకు పలు చర్యలు చేపడుతోంది. జర్మనీ, పోలాండ్‌‌లో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణాల ప్రణాళికలను పక్కన పెట్టింది. అమెరికాలోని ఓహాయో రాష్ట్రంలో మొదలెట్టిన నిర్మాణాల కార్యకలాపాలు కూడా మందకొడిగా సాగుతున్నాయి. మరోవైపు, కోస్టారికాలోని కార్యకలాపాలను మలేషియా, వియత్నాంలకు బదిలీ చేసింది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకుని, ఉత్పాదకత పెంచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఇంటెల్ పేర్కొంది.

ఈ ఏడాది వార్షిక నిర్వహణ ఖర్చులను 17 బిలియన్ డాలర్లకు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సంస్థ ఏప్రిల్‌లో పేర్కొంది. వచ్చే ఏడాదికి ఖర్చులను 16 బలియన్ డాలర్లకు తగ్గిస్తామని వెల్లడించింది. ఈ దిశగా మంచి పురోగతి సాధిస్తున్నట్టు కూడా ఇంటెల్ గురువారం పేర్కొంది.

ఇటీవల వెల్లడించిన త్రైమాసిక ఫలితాల్లో ఇంటెల్‌ 2.9 బిలియన్ డాలర్ల నష్టాలు చవిచూసింది. ఆదాయం మాత్రం 12.9 బిలియన్ డాలర్ల వద్దే ఉండిపోయింది. అయితే, ఈ త్రైమాసికంలో ఆదాయం 13.6 బిలియన్ డాలర్ల వరకూ ఉండొచ్చని సంస్థ అంచనా వేస్తోంది.


ఇవీ చదవండి:

బిలియనీర్‌గా మారిన ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్

సంపన్నులు తమ ఆస్తులను ఎలా పెంచుకుంటారో తెలుసా.. సీఏ చెప్పిన ఈ సూత్రం తెలిస్తే..

Read Latest and Business News

Updated Date - Jul 25 , 2025 | 11:01 AM