Share News

Gold Rates On Nov 24: నేడు బంగారం, వెండి ధరలు ఇవీ.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనసాగుతున్న డిమాండ్

ABN , Publish Date - Nov 24 , 2025 | 06:38 AM

దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రేటు రూ.1.25 లక్షల వద్ద, కిలో వెండి రేటు రూ.1.61 లక్షల వద్ద కొనసాగుతోంది. మరి వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Gold Rates On Nov 24: నేడు బంగారం, వెండి ధరలు ఇవీ.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనసాగుతున్న డిమాండ్
Gold Rates On Nov 24

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటివరకూ ధరలు 2.31 శాతం పెరిగాయి(Gold Rates on Nov 24). అయితే, అంతర్జాతీయంగా మాత్రం బంగారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కుంటోంది. డాలర్ బలపడటం, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితులు తగ్గుముఖం పట్టడం, ఫెడ్ రేట్‌ల కోత ఉండదన్న అంచనాలు ధరలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి (Gold Rates on Nov 24).

గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం, నేటి (నవంబర్ 24) ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,583గా ఉంది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,15,340 వద్ద కొనసాగుతోంది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర రూ.100 మేర తగ్గి రూ.1,63,900 వద్ద తచ్చాడుతోంది.

ఈ వారం కూడా ధరల్లో స్వల్ప మార్పులు మాత్రమే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ1,20,000-1,25,000 రేంజ్‌లోనే ధరలు కదలాడే అవకాశం ఉందని చెబుతున్నాయి. వెండి ధరలు కూడా ప్రస్తుతమున్న స్థాయికి దాదాపుగా పరిమితం అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నాయి. వచ్చే నెలలో జరగనున్న అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశంపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. రేట్‌ల కోత లేని నేపథ్యంలో బంగారం ధరలపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందనేది మార్కెట్ వర్గాల అంచనా.


దేశంలోని వివిధ నగరాల్లో గోల్డ్ రేట్స్ (24కే, 22కే, 18కే) ఇవీ

చెన్నై: ₹1,26,870; ₹1,16,290; ₹97,000

ముంబై: ₹1,25,830; ₹1,15,340; ₹94,370

న్యూ ఢిల్లీ: ₹1,25,980; ₹1,15,490; ₹94,520

కోల్‌కతా: ₹1,25,830; ₹1,15,340; ₹94,370

బెంగళూరు: ₹1,25,830; ₹1,15,340; ₹94,370

హైదరాబాద్: ₹1,25,830; ₹1,15,340; ₹94,370

విజయవాడ: ₹1,25,830; ₹1,15,340; ₹94,370

కేరళ: ₹1,25,830; ₹1,15,340; ₹94,370

పూణె: ₹1,25,830; ₹1,15,340; ₹94,370

వడోదరా: ₹1,25,880; ₹1,15,390; ₹94,420

అహ్మదాబాద్: ₹1,25,880; ₹1,15,390; ₹94,420

వెండి ధరలు

చెన్నై: ₹1,71,900

ముంబై: ₹1,63,900

దిల్లీ: ₹1,63,900

కొల్కతా: ₹1,63,900

బెంగళూరు: ₹1,63,900

హైదరాబాద్: ₹1,71,900

విజయవాడ: ₹1,71,900

కేరళ: ₹1,71,900

పూణే: ₹1,63,900

వడోదరా: ₹1,63,900

అహ్మదాబాద్: ₹1,63,900


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.

ఇవీ చదవండి:

అన్‌క్లెయిమ్డ్‌ బీమా మొత్తాలు క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా

అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 24 , 2025 | 07:34 AM