Gold Rates Dec 1: ఇన్వెస్టర్స్‌కు అలర్ట్.. నేటి బంగారం, వెండి రేట్స్ ఇవీ
ABN , Publish Date - Dec 01 , 2025 | 06:45 AM
నవంబర్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. డిసెంబర్‌లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నేటి రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో బంగారం ధరల ర్యాలీ కొనసాగుతూనే ఉంది. గత వారం రోజుల్లో పసిడి రేట్లు దాదాపు రూ.5 వేల మేర పెరిగాయి. వెండి ధరలు కూడా వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (డిసెంబర్ 1) ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,810గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,18,990 వద్ద తచ్చాడుతోంది. కిలో వెండి ధర రూ.1,84,900 (Gold, Silver Rates On Dec 1).
నవంబర్‌లో బంగారం రేట్లు సుమారు 5.5 శాతం మేర, వెండి ధరలు అంతకుమించి 21.71 శాతం మేర పెరిగాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండికి డిమాండ్ విపరీతంగా ఉంది. ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై ఆశలు పెరగడంతో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాముల) 24 క్యారెట్ పసిడి ధర 4,220 డాలర్లుగా ఉంది. మరోవైపు, సరఫరాలో ఆటంకాల కారణంగా ఔన్స్ వెండి ధర కూడా 56 డాలర్లకు ఎగబాకింది. దీంతో, ఈ నెలలో జరగనున్న అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశాలపై అందరి దృష్టి నెలకొంది. ఈ వారంలో కూడా ధరలు పెరిగే అవకాశం ఉందనేది విశ్లేషకుల అంచనా.
వివిధ నగరాల్లో బంగారం ధరలు(24కే, 22కే, 18కే)
చెన్నై: ₹1,30,680; ₹1,19,790; ₹99,940
ముంబై: ₹1,29,810; ₹1,18,990; ₹97,360
న్యూఢిల్లీ: ₹1,29,960; ₹1,19,140; ₹97,510
కోల్‌కతా: ₹1,29,810; ₹1,18,990; ₹97,360
బెంగళూరు: ₹1,29,810; ₹1,18,990; ₹97,360
హైదరాబాద్: ₹1,29,810; ₹1,18,990; ₹97,360
విజయవాడ: ₹1,29,810; ₹1,18,990; ₹97,360
కేరళ: ₹1,29,810; ₹1,18,990; ₹97,360
పుణె: ₹1,29,810; ₹1,18,990; ₹97,360
వడోదరా: ₹1,29,860; ₹1,19,040; ₹97,410
అహ్మదాబాద్: ₹1,29,860; ₹1,19,040; ₹97,410
కిలో వెండి ధరలు
చెన్నై: ₹1,91,900
ముంబై: ₹1,84,900
న్యూఢిల్లీ: ₹1,84,900
కోల్‌కతా: ₹1,84,900
బెంగళూరు: ₹1,84,900
హైదరాబాద్: ₹1,91,900
విజయవాడ: ₹1,91,900
కేరళ: ₹1,91,900
పుణె: ₹1,84,900
వడోదరా: ₹1,84,900
అహ్మదాబాద్: ₹1,84,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.
ఇవీ చదవండి:
కార్పొరేట్ రుణాలకు పెరిగిన గిరాకీ: ఎస్‌బీఐ చైర్మన్
స్టాక్ మార్కెట్‌లో ఆటుపోట్లకు అవకాశం!
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి