Share News

CEO Salary: హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈఓ వేతనం రూ 94.6 కోట్లు

ABN , Publish Date - Aug 04 , 2025 | 02:07 AM

దేశీయ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈఓ విజయ్‌ కుమార్‌ వేతనం విషయంలో ప్రస్తుతం దేశంలోని టెక్‌ దిగ్గజాల సారథుల కన్నా ఎంతో ముందున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో...

CEO Salary: హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈఓ వేతనం రూ 94.6 కోట్లు

న్యూఢిల్లీ: దేశీయ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈఓ విజయ్‌ కుమార్‌ వేతనం విషయంలో ప్రస్తుతం దేశంలోని టెక్‌ దిగ్గజాల సారథుల కన్నా ఎంతో ముందున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆయన వేతనం రూ.94.6 కోట్లు (1.085 కోట్ల డాలర్లు). దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్‌ సీఈఓ కృతివాసన్‌ (రూ.26.52 కోట్లు), ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ (రూ.80.62 కోట్లు) ఆయన కన్నా ఎంతో వెనుకబడి ఉన్నారు. అంతేకాదు... 2025-26 ఆర్థిక సంవత్సరానికి విజయ్‌ కుమార్‌ వేతనం 71ు మేర పెంచేందుకు (అంటే రూ.154 కోట్లు లేదా 1.86 కోట్ల డాలర్లు) హెచ్‌సీఎల్‌ టెక్‌ డైరెక్టర్ల బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది. మరోవైపు విప్రో సీఈఓ శ్రీనివాస్‌ పల్లియా (రూ.53.64 కోట్లు), టెక్‌ మహీంద్రా సీఈఓ మొహిత్‌ జోషి (రూ.53.9 కోట్లు) కూడా విజయ్‌ కన్నా ఎంతో వెనుకబడి ఉన్నారు.

విజయ్‌ వేతనంలో మూల వేతనం 19.6 లక్షల డాలర్లు కాగా పనితీరు ఆధారిత బోన్‌సగా 17.3 లక్షల డాలర్లున్నట్టు హెచ్‌సీఎల్‌ టెక్‌ వార్షిక నివేదికలో తెలిపింది. 2016లో విజయ్‌ కుమార్‌ హెచ్‌సీఎల్‌ టెక్‌ పగ్గాలు చేపట్టారు. ఈయన సంస్థ బాధ్యతలు చేపట్టిన సమయంలో రూ.1,15,000 కోట్లుగా ఉన్న హెచ్‌సీఎల్‌ టెక్‌ మార్కెట్‌ విలువ 2025 మార్చి 31 నాటికి ఏకంగా రూ.4,32,000 కోట్లకు పెరిగింది. అంటే 2016 నుంచి 3.8 రెట్ల వృద్ధి నమోదైందన్న మాట. ఇదే సమయంలో మిగతా నాలుగు అగ్రగామి ఐటీ సర్వీసెస్‌ దిగ్గజ సంస్థల వృద్ధి 2.5 రెట్లు మాత్రమే ఉంది.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 02:08 AM