Gold Rates Today: పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల
ABN , Publish Date - Apr 26 , 2025 | 07:33 AM
పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల చోటుచేసుకుంది. అయితే, డాలర్ బలపడుతోందన్న అంచనాల నడుమ ఎమ్‌సీఎక్స్ జూన్ కాంట్రాక్ట్స్ ధర తగ్గింది.

బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారంతో పోలిస్తే శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50 మేర పెరిగి రూ.98,290కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.100 మేర పెరిగి రూ.90,100 చేరుకుంది. లఖ్‌నవూలో కూడా పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతాలో మాత్రం గురువారం ముగింపుతో పోలిస్తే శుక్రవారం ఎలాంటి మార్పు లేదు. ఇక ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.103,500గా ఉంది.
మరోవైపు, ఎమ్‌సీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కూడా తగ్గాయి. అమెరికా డాలర్ బలపడటంతో పాటు చైనాతో వాణిజ్య పరమైన ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయన్న భావన ఫ్యూచర్స్ గోల్డ్ ధరలు తగ్గేలా చేసింది. శుక్రవారం సాయంత్రానికి ఎమ్‌సీఎక్స్ గోల్డ్ జూన్ కాంట్రాక్ట్స్ ధర 10 గ్రాములకు రూ.839 మేర తగ్గి రూ.95,073కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. న్యూయార్క్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఔన్స్కు 1.20 శాతం మేర తగ్గి 3308.34 డాలర్లు చేరింది. అయితే, ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వివిధ నగరాల్లో బంగారం ధరలు (22కే, 24కే)
న్యూఢిల్లీ: ₹90,200; ₹98,340
ముంబై: ₹90,050; ₹98,240
చెన్నై: ₹90,050; ₹98,240
హైదరాబాద్: ₹90,050; ₹98,240
బెంగళూరు: ₹90,050; ₹98,240
అహ్మదాబాద్: ₹90,100; ₹98,290
కోలకతా: ₹90,050; ₹98,240
లఖ్‌నవూ: ₹90,200; ₹98,340
ఇవి కూడా చదవండి:
ఐఫోన్ అసెంబ్లింగ్ కార్యకలాపాలనంతా భారత్‌కు మళ్లించే యోచనలో యాపిల్
ఏడు రోజుల బుల్ ర్యాలీకి బ్రేక్.. నష్టాల్లో ముగిసిన భారత మార్కెట్లు
మరిన్ని వాణిజ్య వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి