Gold Rates 25 Apr 2025: బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధర
ABN , Publish Date - Apr 25 , 2025 | 07:43 AM
ఇటీవల స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు గురువారం ట్రేడింగ్ ముగిసేసరికి మళ్లీ పెరిగాయి. అమెరికా-చైనా వాణిజ్యం కొనసాగుతుందన్న అమెరికా ట్రెజరీ అధిపతి వ్యాఖ్యలు మదుపర్లను బంగారంవైపు మళ్లేలా చేశాయి.

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. దేశ రాజధాని 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం నాటి ముగింపుతో పోలిస్తే గురువారం నాడు రూ.200 మేర పెరిగి రూ.99,400కు చేరుకుంది. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తల కారణంగా బంగారానికి మళ్లీ డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల లక్ష దాటిన బంగారం ధర ఆ తరువాత కరెక్షన్ చోటుచేసుకోవడంతో ఏకంగా రూ2400 మేర తగ్గి బుధవారం రూ.99,200కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇక 99.5 నాణ్యత గల బంగారం ధర కూడా రూ.200 మేర పెరిగి రూ.98,900కు చేరుకుంది.
స్టాకిస్టులు, జువెలర్స్ బంగారు నగల నిల్వలను పెంచుకోవడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితలు బంగారానికి మరోసారి రెక్కలనిచ్చాయి. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం సుదీర్ఘకాలం సాగొచ్చన్న యూఎస్ ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెస్సెంట్ హెచ్చరికలతో బంగారం ధరలు పెరిగాయి. మరోసారి చైనాపై సుంకాలు తప్పవంటూ ట్రంప్ సంకేతాలు ఇవ్వడం కూడా ధరల్లో పెరుగుదలకు కారణమైంది. ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.700 మేర పెరిగి రూ.99,900కు చేరుకుంది.
ఇటీవల లక్ష దాటిన బంగారం ధర.. మదుపర్ల లాభాల బుకింగ్‌తో కాస్త తగ్గిన విషయం తెలిసిందే. అయితే, ధరలు మళ్లీ పెరిగే అవకాశం కొట్టిపారేయలేమని విశ్లేషకులు అంటున్నారు. ఆర్థిక ఒడిదుడుకులు కొనసాగుతున్న వేళ సురక్షిత పెట్టుబడుల వైపు మరోసారి జనాలు మళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఈ ఏడాది చివరికల్లా 4000 డాలర్లకు చేరొచ్చని జేపీ మార్గొన్ అంచనా వేసింది. అమెరికా సుంకాల భయాలతో పాటు చైనాతో ముదురుతున్న వాణిజ్య యుద్ధం పరిస్థితి సంక్లిష్టంగా మార్చొచ్చని అంచనా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..
న్యూఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్రం పిలుపు