Share News

Gold Rates on Dec 2: ర్యాలీకి చిన్న బ్రేక్.. స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు

ABN , Publish Date - Dec 02 , 2025 | 01:17 PM

దేశంలో కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. మరి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం

Gold Rates on Dec 2: ర్యాలీకి చిన్న బ్రేక్.. స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు
Gold Rates on Dec 2

ఇంటర్నెట్ డెస్క్: కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు కాస్త నెమ్మదించాయి. సామాన్యులకు స్వల్ప ఊరటనిచ్చేలా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, డిసెంబర్ 2 తేదీ మధ్యాహ్నం 1.00 గంటకు హైదరాబాద్, కోల్‌కతా, ముంబై నగరాల్లో 24 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,30,200గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,30,350గా, 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.1,19,500గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్, 22 క్యారెట్ గోల్డ్ ధరలు వరుసగా రూ.1,31,135, రూ.1,20,400గా ఉన్నాయి (Gold Rates on Dec 2)


ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,19,350. విజయవాడలో కూడా 24 క్యారెట్ పసిడి ధర రూ.1,30,200గా, 22 క్యారెట్ గోల్డ్ రేట్ 1,19,350గా ఉంది. చెన్నైలో వెండి ధర కిలోకు రూ.1,96,000 పలుకుతోంది. హైదరాబాద్, విజయవాడల్లో కూడా దాదాపు ఇదే ధర ఉంది. ముంబై, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1,88,000. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ స్పాట్ ధర ప్రస్తుతం 4,215 డాలర్లు. వెండి స్పాట్ ధర ఔన్స్‌కు 57.22 డాలర్ల వద్ద తచ్చాడుతోంది. అమెరికా ఫెడ్ రేట్‌లో కోతపై స్పష్టత వచ్చే వరకూ గోల్డ్ రేట్స్‌ ఎగుడుదిగుడులు తప్పవనేది విశ్లేషకుల అంచనా.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.


ఇవీ చదవండి:

భారత సంతతి వ్యక్తికి యాపిల్ సంస్థలో కీలక బాధ్యతలు

పీఎస్‌బీల్లో మరో మెగా విలీనం!

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 02 , 2025 | 01:28 PM