Gold Rates on Dec 2: యూఎస్ ఫెడ్ రేటు కోతపై ఆశలు.. రూ.1.3 లక్షల మార్కు దాటిన పసిడి
ABN , Publish Date - Dec 02 , 2025 | 06:47 AM
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేటులో కొత తప్పదన్న అంచనాలు బంగారం ధరలకు రెక్కలొచ్చేలా చేశాయి. దీంతో, గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేటు తగ్గుతుందన్న అంచనాలతో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో గోల్డ్ రేట్ రూ.1.3 లక్షల మార్కును దాటింది. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల నమోదైంది. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం, నేడు ఉదయం (డిసెంబర్ 2) 6.30 గంటల సమయంలో భారత్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,490కు చేరుకుంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఇది రూ. 680 అధికం. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం కూడా సుమారు ఇదే స్థాయిలో పెరిగి రూ.1,19,610కు చేరుకుంది. కిలో వెండి రూ.3200 మేర పెరిగి 1,88,100కు చేరింది (Gold, Silver Rates on Dec 2).
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం రేట్స్‌కు రెక్కలొచ్చాయి. ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ బంగారం ధర రూ.4,241 డాలర్లకు చేరింది. మునుపటితో పోలిస్తే సుమారు 0.3 శాతం మేర పెరిగింది. గత ఆరు వారాల్లో ఇదే గరిష్ఠం. మరోవైపు ఔన్స్ వెండి ధర 3.8 శాతం మేర పెరిగి 58.57 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు తొలగుతున్న వేళ బంగారం ధరలు ఇలా పెరుగుతుండటం ఆశ్చర్యకరమేనని విశ్లేషకులు చెబుతున్నారు. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు, వ్యవస్థాగత మదుపర్లు బంగారం వైపు మళ్లడమే ఇందుకు కారణమని అంటున్నారు.
అయితే, ప్రామాణిక వడ్డీ రేటు పెంపుపై అమెరికా ఫెడరల్ రిజర్వ్‌లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీలోని 12 మంది సభ్యుల్లో ఐదుగురు రేటు కోతపై విముఖంగా ఉన్నారు. బ్యాంకు బోర్డు ఆఫ్ గవర్నర్స్‌లో ముగ్గురు మాత్రం అనుకూలంగా ఉన్నారట. అయితే వడ్డీ రేటులో కోత తప్పదన్న అంచనాలు ఇన్వెస్టర్లలో బలంగా ఉన్నాయి. దీంతో, త్వరలో జరగనున్న ఫెడరల్ రిజర్వ్ సమీక్ష సమావేశాలపై అందరి దృష్టి నెలకొంది.
బంగారం ధరలు ఇవీ (24కే, 22కే, 18కే)
చెన్నై: ₹1,31,680; ₹1,20,710; ₹1,00,660
ముంబై: ₹1,30,490; ₹1,19,610; ₹97,870
న్యూఢిల్లీ: ₹1,30,640; ₹1,19,760; ₹98,020
కోల్‌కతా: ₹1,30,490; ₹1,19,610; ₹97,870
బెంగళూరు: ₹1,30,490; ₹1,19,610; ₹97,870
హైదరాబాద్: ₹1,30,490; ₹1,19,610; ₹97,870
విజయవాడ: ₹1,30,490; ₹1,19,610; ₹97,870
కేరళ: ₹1,30,490; ₹1,19,610; ₹97,870
పుణె: ₹1,30,490; ₹1,19,610; ₹97,870
వడోదరా: ₹1,30,540; ₹1,19,660; ₹97,920
అహ్మదాబాద్: ₹1,30,540; ₹1,19,660; ₹97,920
కిలో వెండి రేట్స్
చెన్నై: ₹1,96,100
ముంబై: ₹1,88,100
న్యూఢిల్లీ: ₹1,88,100
కోల్‌కతా: ₹1,88,100
బెంగళూరు: ₹1,88,100
హైదరాబాద్: ₹1,96,100
విజయవాడ: ₹1,96,100
కేరళ: ₹1,96,100
పుణె: ₹1,88,100
వడోదరా: ₹1,88,100
అహ్మదాబాద్: ₹1,88,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.
ఇవీ చదవండి:
రూపాయి రికార్డు పతనం.. సూచీలకు తప్పని నష్టాలు..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి