Gold price : ఆల్ టైం హై.. గ్రా.10 రూ. లక్ష దాటేసిన బంగారం ధర
ABN , Publish Date - Apr 21 , 2025 | 06:29 PM
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ఇవాళ ఆల్ టైం హై కి చేరింది. అంతర్జాతీయంగా అమెరికా-చైనా సుంకాల ఉద్రిక్తతల మధ్య బంగారం ధర దాదాపు లక్ష రూపాయలకు చేరుకుంది. డాలర్ బలహీనం కావడం కూడా బంగారం రేటు పెరుగుదలకు దారి తీసింది.

Gold Price Almost Hits Rs 1 Lakh Mark: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ఇవాళ ఆల్ టైం హై కి చేరింది. అంతర్జాతీయంగా అమెరికా-చైనా సుంకాల ఉద్రిక్తతల మధ్య బంగారం ధర లక్ష రూపాయల మార్క్ చేరుకుంది. డాలర్ బలహీనం కావడం కూడా బంగారం రేటు పెరుగుదలకు దారి తీసింది. ఢిల్లీలో బంగారం ధర పది గ్రాములకు రూ.1 లక్ష రూపాయల దగ్గరకు చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం సోమవారం 10 గ్రాములకు రూ.99,800గా ఉంది. దీనికి 3శాతం జీఎస్సీ కలిపితే పది గ్రాముల గోల్డ్ ధర అక్షరాలా.. ఒక లక్షా 2వేల 794(1,02,794). శుక్రవారం 10 గ్రాముల ధర రూ.98,150 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులే బంగారం పెరుగుదలకు కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
అటు, 99.5% స్వచ్ఛమైన బంగారం కూడా గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. మునుపటి మార్కెట్ ముగింపులో 10 గ్రాములకు రూ.97,700 కాగా, ఇవాళ 10 గ్రాములకు రూ.99,300 కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. కాగా, ఈ సంవత్సరం ప్రారంభం నుండి, బంగారం ధర రూ.20,850 పెరిగింది. ఇది గత సంవత్సరం ముగింపు నుండి 10 గ్రాములకు 26.41% పెరుగుదలను నమోదు చేసింది. బంగారంతో పాటు, ఇవాళ వెండి ధరలు కూడా పెరిగాయి. కిలోకు రూ.500 పెరిగి రూ.98,500కి చేరుకున్నాయి. శుక్రవారం కిలోకు రూ.98,000 వద్ద వెండి రేటు ఉంది.
ఇక, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో, జూన్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1,621 పెరిగి, (1.7 శాతం) 10 గ్రాములకు రూ.96,875 కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో, స్పాట్ గోల్డ్ కూడా వార్తల్లో నిలిచింది. ఔన్సుకు USD 3,397.18 రికార్డు గరిష్టానికి చేరుకుంది. తరువాత ఔన్సుకు USD 3,393.49కి కొద్దిగా తగ్గింది. ప్రపంచ స్థాయిలో, బంగారం ఫ్యూచర్స్ మొదటిసారిగా గణనీయమైన USD 3,400 పరిమితిని అధిగమించడం విశేషం.
ఇక హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ ధరలు చూస్తే 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 94,660గా ఉంది. అదే, 22 క్యారెట్ల బంగారం ధర అయితే, 90, 150 ఉంది. విజయవాడలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..