Gold Coin Vs Gold Jewellery: గోల్డ్ కాయిన్స్ కొనాలా లేదా బంగారు నగలు కొనాలా అని డౌటా? అయితే..
ABN , Publish Date - Apr 28 , 2025 | 08:50 AM
గోల్డ్ కాయిన్స్ వర్సెస్ బంగారు నగలు.. ఈ రెండిట్లో ఏది బెటరో తెల్చుకోలేకపోతున్నారా? అయితే, ఈ కథనంలో మీ కోసమే. రెండిట్లో ఏది ఎంచుకోవాలనే విషయంలో నిపుణులు పలు సూచనలు సలహాలు ఇచ్చారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం భారత్‌లో బంగారం ధర లక్షకు చేరువగా ఉంది. ధర మరింత పెరగొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక మంది బంగారంపై పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటప్పుడు సహజంగానే గోల్డ్ కాయిన్స్ కొనాలా లేదా బంగారు నగలు కొనాలా అన్న ప్రశ్న తలెత్తుతుంది. రెండింట్లో ఏది ఎంపిక చేసుకోవాలనే దానిపై నిపుణులు పలు సలహాలు సూచనలు చేశారు. వీటి ఆధారంగా వినియోగదారులు ఓ నిర్ణయానికి రావచ్చు.
నిపుణులు చెప్పే దాని ప్రకారం.. గోల్డ్ కాయిన్స్, బంగారు నగలు వేటికవే ప్రత్యేకమైనవి. వేటి ఉపయోగాలు వాటికి ఉన్నాయి. అయితే, బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి గోల్డ్ కాయిన్స్ అత్యంత అనుకూలం. గోల్డ్ కాయిన్స్ స్వచ్ఛత విషయంలో సందేహాలకు తావు ఉండదు. ప్రమాణిక తూకం, సర్టిఫికేషన్‌తో ఇవి అందుబాటులో ఉంటాయి. ఇక సాధారణ బంగారు నగల కంటే వీటి నిల్వ రవాణా చాలా సులభం. దీర్ఘకాలిక పెట్టుబడులకు బంగారపు నాణేలు అత్యంత అనుకూలం.
వీటికి మార్కెట్‌లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. దీంతో, తక్షణం విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. తయారీ ఖర్చులు వంటి వాటి బెడద ఉండదు కాబట్టి వాటి విలువలో తరుగు ఉండదు. బంగారాన్ని కేవలం పెట్టుబడి సాధనంగా భావించే వారికి గోల్డ్ కాయిన్స్‌కు మించినవి లేవని నిపుణులు చెబుతున్నారు.
ఇక బంగారు నగలకు పెట్టుబడి సాధనాలుగానే కాకుండా సాంస్కృతిక విలువ కూడా ఉంటుంది. బంగారు నగలు ధరించడం ఎంతో మందికి ఓ సెంటీమెంట్. తల్లిదండ్రులు లేదా తాతముత్తాల నుంచి వచ్చిన కొన్న ఆభరణాలను కొందరు జాగ్రత్తగా దాచుకుంటారు. నచ్చిన వ్యక్తులు ఇచ్చిన బంగారు నగలకు ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కాబట్టి, జనాల దృష్టిలో బంగారు నగలకు సాంస్కృతిక ప్రాముఖ్యత చాలా ఎక్కువ.
ఇక తయారీ ఖర్చులు, తరుగు వంటి వాటి కారణంగా బంగారం నగల రీసేల్ వాల్యూ తక్కువగానే ఉంటుంది. దీంతో, పెట్టుబడి సాధనంగా వీటి విలువ కొంత తగ్గుతుంది. ఇక బంగారు కాయిన్స్ కంటే ఎక్కువ డబ్బు వెచ్చించి వీటిని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. నగల డిజైన్ పాతదనో, లేదా తరుగు ఉందనే కారణాలతో వీటిని తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుంది. బంగారు నాణేలతో పోలిస్తే వీటి లిక్విడిటీ (డబ్బుగా మార్చుకునే సౌలభ్యం) తక్కువ. ఇక బంగారు నగలను స్టేటస్ సింబల్‌గా భావించేవారు వీటిపైనే ఎక్కువ మొగ్గు చూపుతారు.
ఇవి కూడా చదవండి:
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలిచ్చే బిజినెస్.. ఒక్కసారి ట్రై చేసి చూడండి..
జీవితంలో ఆర్థిక స్వాతంత్ర్యం సాధించేందుకు ఎంత డబ్బు కావాలి..
సంపన్నులు అత్యధికంగా ఉన్న దేశాలు ఇవే
Read More Business News and Latest Telugu News