Gold And Silver Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు..
ABN , Publish Date - Jun 08 , 2025 | 06:48 AM
Gold And Silver Rate: నిన్న హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,800 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,970 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,480 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పడిపోయింది. ఆ ప్రభావంతో ఇండియాలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వెళుతున్న ధరలు శనివారం తగ్గాయి. గత నెల మొదట్లో లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అయిన స్వచ్ఛమైన బంగారం ఇప్పుడు 97 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. భవిష్యత్తు మళ్లీ ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా..
గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం.. నిన్న హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,800 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,970 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,480 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. పెరగలేదు.. తగ్గలేదు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,970 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,800 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 73,480 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు ఇలా.. గత కొద్దిరోజుల నుంచి వెండి ధరలు స్థిరంగా పెరుగుతూ వెళుతున్నాయి. బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు దూసుకెళుతున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 10,700 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,70,000 దగ్గర ట్రేడ్ అయింది. బంగారం లాగే ఈ రోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. పెరగలేదు.. తగ్గలేదు. 100 గ్రాముల వెండి ధర నేడు 10,700 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,07,000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
జస్బీర్ ఫోన్‌లో 150 పాకిస్థాన్ కాంటాక్టులు