Share News

సనోఫీతో డాక్టర్‌ రెడ్డీస్‌ భాగస్వామ్యం విస్తరణ

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:36 AM

సనోఫీ హెల్త్‌కేర్‌తో తమ భాగస్వామ్య ఒప్పందాన్ని మరింత విస్తరించినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ప్రకటించింది. తాజా నిర్ణయంతో శిశువుల్లో ఏర్పడే...

సనోఫీతో డాక్టర్‌ రెడ్డీస్‌ భాగస్వామ్యం విస్తరణ

సనోఫీతో డాక్టర్‌ రెడ్డీస్‌ భాగస్వామ్యం విస్తరణ

త్వరలో మార్కెట్లోకి బేఫోర్టస్‌ ఔషధం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సనోఫీ హెల్త్‌కేర్‌తో తమ భాగస్వామ్య ఒప్పందాన్ని మరింత విస్తరించినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ప్రకటించింది. తాజా నిర్ణయంతో శిశువుల్లో ఏర్పడే శ్వాసకోశ సంబంధిత వ్యాధి నివారణలో ఉపయోగించే సరికొత్త ఔషధం భారత మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం తమకు కలిగిందని డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. బేఫోర్టస్‌ పేరుతో ఈ ఔషధాన్ని ప్రీ ఫిల్డ్‌ ఇంజెక్షన్‌ రూపంలో విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ ఔషధాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో విడుదల చేసే ఆస్కారం ఉందని, గరిష్ఠంగా 24 నెలల వయసు గల చిన్నారుల వరకు అందరికీ ఈ ఔషధాన్ని వినియోగించవచ్చని పేర్కొంది. ఈ ఒప్పందంతో భారత్‌లో బేఫోర్టస్‌ ఔషధాన్ని పంపిణీ చేసేందుకు తమకు ప్రత్యేక హక్కులు లభిస్తాయని డాక్టర్‌ రెడ్డీస్‌ బ్రాండెడ్‌ మార్కెట్స్‌ విభాగం సీఈఓ ఎంవీ రమణ తెలిపారు.

ఇవి కూడా చదవండి

Live In Partner: పదేళ్ల సహజీవనం.. బెడ్డు కింద ప్రియురాలి శవం..

అడిగినంత పనీర్ వేయలేదని పెళ్లి మండపంలో దారుణం..

Updated Date - Apr 29 , 2025 | 04:36 AM