వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి డెంగ్యూ వ్యాక్సిన్
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:24 AM
వచ్చే ఏడాది కల్లా భారత మార్కెట్లోకి డెంగ్యూ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. జపాన్‌కు చెందిన తకెడా ఫార్మాస్యూటికల్స్.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ‘బయోలాజికల్ ఈ (బీఈ)’తో...

క్యూడెంగా పేరుతో అందుబాటులోకి
‘బయోలాజికల్-ఈ’తో కలిసి విడుదల చేయనున్న తకెడా ఫార్మా
ముంబై: వచ్చే ఏడాది కల్లా భారత మార్కెట్లోకి డెంగ్యూ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. జపాన్‌కు చెందిన తకెడా ఫార్మాస్యూటికల్స్.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ‘బయోలాజికల్ ఈ (బీఈ)’తో కలిసి ‘క్యూడెంగా’ పేరుతో ఈ వ్యాక్సిన్‌ను మన దేశంలో తయారు చేసి మార్కెట్ చేయనుంది. తకెడా ఫార్మా ఉన్నతాధికారి ఒకరు ఈ విషయం వెల్లడించారు. కంపెనీ ప్రస్తుతం మనుషులపై ఈ వ్యాక్సిన్ ప్రభావాన్ని పరీక్షిస్తోంది. ఈ పరీక్షలు పూర్తయిన వెంటనే భారత్‌తో పాటు 40కిపైగా దేశాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. మూడు నెలల విరామంతో రెండు డోసులు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే డెంగ్యూ రాకుండా అడ్డుకోవచ్చని తకెడా చెబుతోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కోటి డోసుల వ్యాక్సిన్ తయారు చేసి వివిధ దేశాలకు సరఫరా చేసింది. మనుషులపై ప్రయోగాలు పూర్తయిన తర్వాత తాను ఉత్పత్తి చేసే ఈ వ్యాక్సిన్‌లో సగ భాగం బీఈ ద్వారా తయారు చేయించాలని తకెడా భావిస్తున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి
Live In Partner: పదేళ్ల సహజీవనం.. బెడ్డు కింద ప్రియురాలి శవం..
అడిగినంత పనీర్ వేయలేదని పెళ్లి మండపంలో దారుణం..