Share News

Bharat brand: వస్తున్నాయ్‌ భారత్‌ సహకార ట్యాక్సీలు

ABN , Publish Date - Aug 04 , 2025 | 02:03 AM

సహకార రంగంలోని కొన్ని సహకార సంఘాల కన్సార్షియం ఈ ఏడాది చివరి నాటికి ‘‘భారత్‌’’ బ్రాండ్‌తో దేశంలో సహకార ట్యాక్సీ సర్వీసును ప్రవేశపెట్టబోతోంది. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న...

Bharat brand: వస్తున్నాయ్‌ భారత్‌ సహకార ట్యాక్సీలు

న్యూఢిల్లీ: సహకార రంగంలోని కొన్ని సహకార సంఘాల కన్సార్షియం ఈ ఏడాది చివరి నాటికి ‘‘భారత్‌’’ బ్రాండ్‌తో దేశంలో సహకార ట్యాక్సీ సర్వీసును ప్రవేశపెట్టబోతోంది. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న ఓలా, ఉబర్‌ వంటి ట్యాక్సీ సర్వీసులకు సవాలు విసిరేందుకు సహకార సంఘం సంసిద్ధం అవుతోంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే రూ.300 కోట్ల అధీకృత మూలధనంతో ఢిల్లీ, గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్‌, మహారాష్ట్రల్లో 200 మంది డ్రైవర్లను నియమించుకుంది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ), ఇఫ్కో, గుజరాత్‌ సహకార పాల మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌) సహా ఎనిమిది సంఘాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. డ్రైవర్లకు మెరుగైన రాబడులు అందించడంతో పాటు ప్రయాణికులకు సరసమైన ధరల్లో ట్యాక్సీ సర్వీసును అందుబాటులోకి తేవడం దీని లక్ష్యమని ఎన్‌సీడీసీ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోహిత్‌ గుప్తా అన్నారు. ప్రభుత్వ వాటా ఏదీ లేకుండా పూర్తిగా సహకార సంఘాల నిధులతోనే ఈ సర్వీస్‌ నడుస్తుందని ఆయన చెప్పారు. క్రిషక్‌ భారతి కో ఆపరేటివ్‌ లిమిటెడ్‌ (క్రిభ్‌కో), నాబార్డ్‌, జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి బోర్డు (ఎన్‌డీడీబీ), నేషనల్‌ కో ఆపరేటివ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ దీనిలో ఇతర వ్యవస్థాపక సభ్యులు. ఈ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించేందుకు ఇతర సహకార సంస్థలతో కూడా చర్చలు జరుపుతున్నట్టు గుప్తా చెప్పారు. టెక్నాలజీ భాగస్వామిని త్వరలో ఖరారు చేస్తామని గుప్తా తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 02:03 AM