Share News

Focus on AI Training: క్యాప్‌జెమినీలో 45000 నియామకాలు

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:35 AM

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) 12,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న సమయంలో ఫ్రెంచ్‌ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ కాస్త ఊరట కలిగించే వార్త చెప్పింది...

Focus on AI Training: క్యాప్‌జెమినీలో 45000 నియామకాలు

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) 12,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న సమయంలో ఫ్రెంచ్‌ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ కాస్త ఊరట కలిగించే వార్త చెప్పింది. ఈ ఏడాది 40,000-45,000 నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. అందులో 35-45 శాతం అనుభవజ్ఞులను ఉద్యోగంలో చేర్చుకోవాలనుకుంటున్నట్లు క్యాప్‌జెమినీ సీఈఓ అశ్విన్‌ యార్దీ వెల్లడించారు. ఫ్రాన్స్‌ కేంద్రంగా కార్యకలపాలు సాగిస్తున్న ఈ కంపెనీకి చెందిన భారత కార్యాలయాల్లో ప్రస్తుతం 1.75 లక్షల మంది పనిచేస్తున్నారు. భారత్‌లో ప్రాంగణ నియామకాల (క్యాంపస్‌ హైరింగ్‌) ద్వారా ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకునేందుకు కంపెనీ 50కి పైగా కాలేజీలు, క్యాంప్‌సలతో జట్టు కట్టింది. ప్రస్తుత సీజన్‌ హైరింగ్‌ కొనసాగుతోందని, కొత్తగా రిక్రూట్‌ చేసుకున్నవారికి కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతలో శిక్షణ ఇవ్వడంపై దృష్టిసారించినట్లు కంపెనీ తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి...

అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిగ్‌బాస్‌ అరెస్ట్ ఖాయం

Read Latest AP News and National News

Updated Date - Aug 03 , 2025 | 05:35 AM