Apple Back To School 2025: విద్యార్థులకు యాపిల్ కంపెనీ బంపర్ ఆఫర్
ABN , Publish Date - Jul 20 , 2025 | 11:37 AM
Apple Back To School 2025: మీరు గనుక మ్యాక్ బుక్ ఎయిర్, మ్యాక్ బుక్ ఎయిర్, ఐమ్యాక్ కొంటే గనుక మీరు ఎయిర్‌పాడ్స్, ఎయిర్‌పాడ్స్ ప్రో 2, మ్యాజిక్ మౌస్, ట్రాక్‌పాడ్, మ్యాజిక్ కీబోర్డులలో ఏదో ఒక దాన్ని తీసుకోవచ్చు.

యాపిల్ కంపెనీ విద్యార్థుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక యాపిల్ ప్రాడెక్ట్ కొంటే మరో ప్రాడెక్ట్ ఫ్రీగా ఇస్తోంది. మీరు మ్యాక్ లేదా ఐపాడ్ కొంటే ప్రీమియమ్ యాక్ససరీస్ ఎయిర్‌పోడ్స్, యాపిల్ పెన్సిల్, మ్యాజిక్ కీబోర్డ్, మ్యాజిక్ మౌస్ గెలుచుకునే అవకాశం ఉంది.
ఆఫర్ టైం
ఈ ఆఫర్ స్టార్ట్ అయి చాలా రోజులు అయింది. జూన్ 17వ తేదీన ప్రారంభమైంది. సెప్టెంబర్ 30వ తేదీన ముగియనుంది. ఈ ఆఫర్ కేవలం ఇండియాలో మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా యాపిల్ అఫిషియల్ వెబ్‌సైట్లలో మాత్రమే ఆఫర్ ఉంటుంది. లేదా 000800 040 1966 కాల్ చేసి కావాల్సిన వస్తువుల్ని కొనుక్కోవచ్చు.
ఏది కొంటే.. ఏది ఫ్రీ..
మీరు గనుక మ్యాక్ బుక్ ఎయిర్, మ్యాక్ బుక్ ఎయిర్, ఐమ్యాక్ కొంటే గనుక మీరు ఎయిర్‌పాడ్స్, ఎయిర్‌పాడ్స్ ప్రో 2, మ్యాజిక్ మౌస్, ట్రాక్‌పాడ్, మ్యాజిక్ కీబోర్డులలో ఏదో ఒక దాన్ని తీసుకోవచ్చు. వీటి విలువ దాదాపు 20 వేల రూపాయలు ఉంటుంది. బిల్ చేసేటప్పుడే మీకు డిస్కౌంట్ రూపంలో వీటిలో ఏదో ఒక దాని ధర మైనస్ అవుతుంది. కూపన్ కోడ్ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు.
ఈ ఆఫర్‌కు ఎవరు అర్హులు..
యూనివర్శీటీలో లేదా కాలేజీలో చదువుతున్న విద్యార్థులై ఉండాలి. అది కూడా ఇండియాకు చెందిన వారై ఉండాలి. ఇప్పుడే కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న వారైనా ఆఫర్ వర్తిస్తుంది.
కాలేజీలో చదువుతున్న విద్యార్థులు లేదా కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల తరపున వారి తల్లిదండ్రులు కొనాలి.
పబ్లిక్ లేదా ప్రైవేట్ యూనివర్శిటీ లేదా స్కూల్‌లో చదువు చెబుతున్న స్టాఫ్ లేదా టీచర్స్‌కు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.
యాపిల్ ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో స్టూడెంట్ ఐడీ ద్వారా వెరిఫికేషన్ చేయించాలి.
ఇవి కూడా చదవండి
విమాన ప్రమాదం.. యూఎస్ మీడియా కథనంపై ఏవియేషన్ ఎక్స్‌పర్ట్ ఆగ్రహం
ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్న అన్నదమ్ములు