Americans Repairing Old iPhones: ట్రంప్ ఎఫెక్ట్.. పాత ఐఫోన్లను రిపేర్ చేసుకుంటున్న అమెరికన్లు
ABN , Publish Date - May 19 , 2025 | 07:30 AM
ట్రంప్ సుంకాల దెబ్బకు ఐఫోన్ల ధరలు పెరగడంతో ఇబ్బంది పడుతున్న అమెరికన్లు అనేక మంది ప్రస్తుతం పాత ఫోన్లను రిపేర్ చేయించుకునేందుకే మొగ్గు చూపుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఐఫోన్.. ఓ స్టేటస్ సింబల్. మార్కెట్లోకి కొత్త ఫోన్ విడుదలైందంటే చాలు.. జనాలు షో రూమ్‌ల ముందు క్యూకడతారు. అమెరికాలో ఈ ట్రెండ్ మరింత వేళ్లూనుకుని ఉంది. అయితే, ట్రంప్ సుంకాల దెబ్బ అమెరికన్లలో భారీ మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం అనేక మంది కొత్త ఐఫోన్లకు బదులు పాత ఫోన్లను రిపేర్ చేయించుకుని వాడుకుంటున్నారు.
అమెరికా పరిశ్రమను రక్షించుకునేందుకు ట్రంప్ విదేశీ దిగుమతులపై భారీ సుంకాలు విధించిన విషయం తెలిసిందే. చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్‌పై 54 శాతం, వియత్నాం ఉత్పత్తులపై 46 శాతం, భారతీయ వస్తువులపై 26 శాతం సుంకం విధించారు. ఐఫోన్ తయారీకి ఈ మూడు దేశాలే కీలకం. దీంతో, సుంకాల విధింపు ఐఫోన్ ధరలను అమాంతం పెంచేశాయి. అమెరికా ప్రజలు కొత్త ఫోన్లు కొనలేని స్థితికి తీసుకొచ్చాయి.
దీంతో, అనేక మంది పాత ఐఫోన్లనే వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. రిపేర్లు చేసుకుని మళ్లీ వాడుకుంటున్నారు. ఐఫోన్ 12 మినీ యూజర్ ఒకరు ఫోన్ బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతే 90 డాలర్లు పెట్టి కొత్త బ్యాటరీ వేయించుకుని ఐఫోన్‌ను పునర్ వినియోగించడం ప్రారంభించారు. ఇలా అనేక మంది పాత్ ఐఫోన్లను రిపేర్ చేసుకుని వాడుకునేందుకే మొగ్గు చూపుతున్నారు.
అసలు యాపిల్ ఫోన్లను రిపేర్ చేయడం కష్టం అన్న వాదన ఉంది. దీంతో, స్పేర్ పార్ట్స్ కొరత ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. దీనికి తోడు ధరాభారం కూడా పెరగడంతో ఐఫోన్ ప్రియులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఐఫోన్ తయారీ విషయంలో యాపిల్ అనుసరించే జస్టిన్ ఇన్ టైం సప్లై విధానం కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిన్న ఆటకం వచ్చినా ఐఫోన్ల కొరత ఏర్పడుతుందని చెబుతున్నారు.
ధరాభారంతో ఐఫోన్లు కొనలేని స్థితి, సరఫరాకు అంతరాయాలు, రిపేర్ అవకాశాలు తక్కువగా ఉండటం జనాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఫోన్ రిపేరింగ్ అవకాశాలు లేకుండా చేయడంపై యాపిల్‌ను వినియోగదారులు విమర్శిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆ పొరపాట్లే కారణం.. బైజూస్ పతనంపై సంస్థ సీఈఓ కీలక వ్యాఖ్యలు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి