Amazon layoffs: అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..
ABN , Publish Date - Nov 22 , 2025 | 06:59 PM
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఏకంగా 14 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లేఆఫ్స్ ప్రభావం సంస్థలోని దాదాపు అన్ని విభాగాలపై పడింది. క్లౌడ్ సర్వీసెస్, డివైజెస్, రిటెయిల్, అడ్వర్టైజింగ్, గ్రాసరీస్ విభాగాల్లోని ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు
ప్రస్తుత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో చాలా దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఏకంగా 14 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లేఆఫ్స్ ప్రభావం సంస్థలోని దాదాపు అన్ని విభాగాలపై పడింది. క్లౌడ్ సర్వీసెస్, డివైజెస్, రిటెయిల్, అడ్వర్టైజింగ్, గ్రాసరీస్ విభాగాల్లోని ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు (Amazon engineer layoffs).
అమెజాన్‌లోని ఈ లే ఆఫ్స్‌కు సంబంధించిన కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగ కోతల్లో అత్యధికంగా నష్టపోయింది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లేనని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికాలోని న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, వాషింగ్టన్ రాష్ట్రాల్లోని వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (WARN) ఫైలింగ్స్ ఈ విషయాన్ని బయటపెట్టింది. పై రాష్ట్రాల్లో మొత్తం 4,700 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారట (tech job cuts Amazon).
ఆ తొలగించిన 4,700 మందిలో 1800 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లేనట (Amazon AI workforce). ముఖ్యంగా మిడ్-లెవల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్లు ఎక్కువగా ప్రభావితమయ్యారు. అమెజాన్ సంస్థ ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై భారీగా ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్యూరోక్రసీని తగ్గించి, అనవసర లేయర్లను తొలగిస్తున్నామని అమెజాన్ ప్రతినిధి పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో మరో రౌండ్ లే ఆఫ్స్ ఉండే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
ఐబొమ్మ రవి కేసు.. మరో కీలక పరిణామం
ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..