Share News

ITR Filing mistakes: ఐటీఆర్ ఫైలింగ్ గడుపు పొడిగింపు.. ఈ తప్పులు మాత్రం చేయకండి..

ABN , Publish Date - Aug 04 , 2025 | 12:53 PM

కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించింది. ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ తుది గడువును పొడిగింది. ఈ ఏడాది జులై 31వ తేదీతో ముగియాల్సిన ఐటీఆర్ ఫైలింగ్ తుది గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు.

ITR Filing mistakes: ఐటీఆర్ ఫైలింగ్ గడుపు పొడిగింపు.. ఈ తప్పులు మాత్రం చేయకండి..
Filing Income tax returns

కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు (Tax Payers) ఉపశమనం కల్పించింది. ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్స్ (Income tax return) ఫైలింగ్ తుది గడువును పొడిగింది. ఈ ఏడాది జులై 31వ తేదీతో ముగియాల్సిన ఐటీఆర్ ఫైలింగ్ తుది గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. ఎటువంటి డిమాండ్ లేకుండా ప్రభుత్వం రిటర్న్‌ దాఖలు చేసే తేదీని పొడిగించడం ఇదే మొదటిసారి. ఐటీఆర్ ఫారమ్‌లో అనేక ముఖ్యమైన మార్పుల కారణంగా ఈసారి సీబీడీటీ ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి తేదీని పొడిగించింది.


ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి (ITR Filing mistakes).

  • తప్పుడు ఐటీఆర్ ఫారమ్‌ను ఉపయోగించడం వల్ల మళ్లీ నోటీసులు అందుకోవాల్సి ఉంటుంది. మీ ఆదాయం, మూలధన లాభాలను పరిగణనలోకి తీసుకుని ఐటీఆర్ ఫామ్‌ను ఎంచుకోవాలి.

  • మీరు ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత మీ రిటర్న్‌ను ఈ-వెరిఫై చేయించకపోతే.. దానిని ఐటీఆర్ సమర్పించలేనట్లుగా పరిగణిస్తారు. కాబట్టి ధృవీకరణ తప్పనిసరి.

  • 2024 -25 ఆదాయం కోసం, AY 2025–26 ఎంచుకోండి. తప్పు సంవత్సరాన్ని ఎంచుకోవడం జరిమానాలకు దారితీయవచ్చు.

  • మీ పేరు, పాన్, పుట్టిన తేదీ, బ్యాంక్ ఖాతా లేదా సంప్రదింపు వివరాలలో తప్పులు ఉంటే ప్రాసెసింగ్ సమస్యలు తలెత్తుతాయి.

  • పొదుపు, స్థిర డిపాజిట్లపై వడ్డీ, అద్దె ఆదాయం లేదా మూలధన లాభాలతో సహా అన్ని ఆదాయ వనరులను ప్రకటించండి. లేకపోతే జరిమానాలు పడవచ్చు.

  • మీ ఆదాయానికి బాగా సరిపోయే పన్ను విధానాన్ని ఎంచుకోండి. తప్పుడు పన్ను విధానాన్ని ఎంచుకోవడం వల్ల ప్రయోజనాలు లేదా తగ్గింపులను కోల్పోయే ప్రమాదం ఉంది.

  • ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు పంపితే, వెంటనే స్పందించండి. దానిని విస్మరించడం వల్ల జరిమానాలు లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.

  • మీ పన్నును సకాలంలో చెల్లించండి. ఆలస్యమైతే జరిమానా లేదా వడ్డీ కట్టాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి

స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..


ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 12:53 PM