Share News

Vastu Tips For Morning: ఉదయం లేవగానే ఇలా చేస్తే.. ఆరోగ్యం, అదృష్టం మీ సొంతం.!

ABN , Publish Date - Jul 08 , 2025 | 08:37 AM

వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం కొన్ని పనులు చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఉదయం ఏ పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Vastu Tips For Morning: ఉదయం లేవగానే ఇలా చేస్తే.. ఆరోగ్యం, అదృష్టం మీ సొంతం.!
Vastu Tips For Morning

Vastu Tips For Morning: సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్ర నియమాలను పాటించడం వల్ల జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం నిద్రలేచిన తర్వాత కొన్ని పనులు చేయాలి. ఉదయం ఈ పనులు చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుందని, అంతేకాకుండా ఆరోగ్యంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఉదయం ఏ పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..


అరచేతులను చూసుకోవడం

ఉదయం నిద్రలేచిన తర్వాత అరచేతులను చూసుకోవడం శుభప్రదమని నమ్ముతారు. దీనిని కర దర్శనం అని కూడా అంటారు. అరచేతులలో లక్ష్మీ, సరస్వతి, విష్ణువు ఉంటారని నమ్ముతారు కాబట్టి ఉదయం వాటిని చూడటం ద్వారా ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. 

భూమిని తాకి నమస్కరించాలి

ఉదయం నిద్ర లేచిన తర్వాత భూమిని తాకి నమస్కరించడం మంచిది. ఇది భారతీయ సంప్రదాయంలో భూమికి కృతజ్ఞతలు తెలిపే ఒక ఆచారం. 'క్షమా యాచనం' అని కూడా పిలవబడే ఈ ఆచారం ద్వారా మనం భూమి తల్లికి గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది.


దేవతల నుండి ఆశీస్సులు పొందుతారు

ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ఇల్లు, ఆలయాన్ని శుభ్రం చేయండి. జీవితంలో ఆనందం, శాంతి కోసం దేవుడికి పూజ చేయండి. స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించి హారతి ఇవ్వండి. ఇలా చేస్తే అదృష్టం కలిసి వస్తుంది.

పొరపాటున కూడా ఈ పని చేయకండి

ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎవరితోనూ వాదించకండి. అలాగే, ఎవరి గురించి తప్పుగా ఆలోచించకండి. దీనితో పాటు, ఉదయం నిద్రలేచిన వెంటనే మురికి పాత్రలను చూడటం మానుకోండి. మురికి పాత్రలను రాత్రే కడిగేయండి. లేదంటే ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుంది.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

ఈ జంతువు పాలు చాలా డేంజర్.. ఎందుకంటే..

ఇవి తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి.. జాగ్రత్త..

For More lifestyle News

Updated Date - Jul 08 , 2025 | 12:00 PM