Vastu Tips For Bedroom: బెడ్ రూమ్‌లో దేవుళ్ల చిత్రాలను ఉంచవచ్చా.. ఈ నియమాలు తెలుసుకోండి..
ABN , Publish Date - Jul 07 , 2025 | 11:54 AM
వాస్తు శాస్త్రం ప్రకారం, బెడ్ రూమ్‌కు సంబంధించిన కొన్ని నియమాలను పాటించడం వల్ల జీవితంలో సానుకూల శక్తి వస్తుంది. అంతేకాకుండా, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కాబట్టి, బెడ్ రూమ్‌కి సంబంధించిన వాస్తు నియమాలను తెలుసుకుందాం..

Bedroom Vastu Tips: ఇంట్లో సానుకూల శక్తిని పెంచడంలో వాస్తు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే, చాలా సార్లు మనం తెలిసి లేదా తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల వాస్తు దోషం వస్తుంది. చాలా మంది బెడ్‌రూమ్‌లలో దేవుళ్ల చిత్రాలను లేదా విగ్రహాలను ఉంచుతారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం, బెడ్‌రూమ్‌లో దేవుని చిత్రాలను ఉంచడం మంచిది కాదు. ఇది జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య సంబంధంలో సమస్యలు వస్తాయని అంటున్నారు.
బెడ్ రూమ్‌లో గురువు, దేవుడు, దేవత లేదా చనిపోయిన వ్యక్తి చిత్రాలను ఉంచకూడదు. దీనితో పాటు, యుద్ధానికి సంబంధించిన చిత్రాలను కూడా బెడ్ రూమ్‌లో ఉంచకూడదు. ఇది ఇంట్లో శాంతికి భంగం కలిగిస్తుందని, తగాదాలను పెంచుతుందని చెబుతారు. మీకు కావాలంటే.. రాధా-కృష్ణుల చిత్రాన్ని పడకగదిలో ఉంచవచ్చు.
బెడ్ రూమ్‌లో ఈ వస్తువులను ఉంచకండి..
వాస్తు శాస్త్రం ప్రకారం, బెడ్‌రూమ్‌లో షూ రాక్ ఉంచకూడదు. బెడ్‌రూమ్‌లో బూట్లు, చెప్పులు ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ఆకర్షిస్తుందని, ఇంట్లో సానుకూల శక్తి తగ్గుతుందని చెబుతారు.
బెడ్ రూమ్‌లో కత్తులు, బ్లేడ్లు లేదా కత్తెరలు ఉంచకూడదు. అలాగే, పొరపాటున కూడా చీపుర్లు బెడ్ రూమ్ లో ఉంచకూడదు.
ఏదైనా పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువు ఉంటే, దానిని బెడ్ రూమ్ నుండి వెంటనే తీసివేయాలి. బెడ్ రూమ్‌లో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రతికూల శక్తికి మూలంగా మారుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కుటుంబ సమస్యలు పెరుగుతాయని అంటున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం, పడకగదిలో మొక్కలు ఉంచకూడదు. మీకు కావాలంటే ఒక చిన్న ఇండోర్ మొక్కను ఉంచవచ్చు. కానీ ముళ్ళు ఉన్న మొక్కను ఉండకూడదు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
వెండి ఆభరణాలతో అద్భుతమైన ప్రయోజనాలు..!
రూంలో రహస్య కెమెరాలు.. ఇలా గుర్తించండి..