Share News

ఒక సీటుకే వైసీపీ పరిమితం: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:19 AM

వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఒక సీటుకే పరిమితం చేస్తారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

ఒక సీటుకే వైసీపీ పరిమితం: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

తిరుచానూరు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఒక సీటుకే పరిమితం చేస్తారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. తిరుచానూరు పద్మావతీ దేవి ఆలయం ఆలయం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జిల్లా పర్యటనలు చేస్తూ జగన్‌ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ఒక మహిళా ఎమ్మెల్యేను అసభ్యకరంగా దూషించిన నేత ఇంటికి వెళ్లి పరామర్శించిన జగన్‌కు... కనీస సంస్కారం, విజ్ఞత కూడా లేదు. వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు. ఇలాగే విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే భవిష్యత్తులో జగన్‌ను జనమే రాళ్లతో కొట్టే రోజులు వస్తాయి. కార్మికులు, రైతుల పక్షాన ఏనాడు జగన్‌ నిలబడలేదు. పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా కుట్రలు పన్నుతున్నారు’ అని మంత్రి ఆరోపించారు.

Updated Date - Aug 03 , 2025 | 05:19 AM