BIG BREAKING: కొడాలి నానికి బిగ్ షాక్!
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:11 PM
మాజీ మంత్రి కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. సీఎం చంద్రబాబు, కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

విశాఖపట్నం, ఆగస్టు 3: మాజీ మంత్రి కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదు అయింది. సీఎం చంద్రబాబు, కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు,.. కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కొడాలి నానిపై 2024లో విశాఖ త్రీటౌన్ పోలీసులకు విశాఖవాసి అంజనాప్రియ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొడాలి నానిపై U/S353(2), 352, 351(4), 196(1) BNS 467, IT యాక్టు కింద నమోదు చేశారు. గుడివాడలో కొడాలి నానికి విశాఖ త్రీటౌన్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.