MLA Balakrishna: ఏలూరులో వేగ జ్యూయలర్స్ ప్రారంభం
ABN , Publish Date - Jun 14 , 2025 | 05:13 AM
ఏలూరు జిల్లా ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద విశాలమైన ప్రాంగణంలో వేగ జ్యువెలర్స్ షోరూమ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ షోరూమ్‌ను సినీ నటి సంయుక్త మీనన్‌తో కలిసి సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు.

ఏలూరు రూరల్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద విశాలమైన ప్రాంగణంలో వేగ జ్యువెలర్స్ షోరూమ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ షోరూమ్‌ను సినీ నటి సంయుక్త మీనన్‌తో కలిసి సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ వేగ జ్యువెలర్స్ కస్టమర్లకు నాణ్యమైన సేవలను అంతర్జాతీయ ప్రమాణాలతో అందిస్తూ, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిందన్నారు. సంయుక్త మీనన్ మాట్లాడుతూ ప్రతీ లక్ష రూపాయల కొనుగోలుపైన ఉచిత బంగారం నాణెం అందించడమే కాకుండా సంప్రదాయ నగల నుంచి ప్యాషన్ నగలు వరకు ఆభరణాలు అందుబాటులో ఉంచారని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలకు నాణ్యమైన బంగారు, వజ్రాభరణాలను అందిస్తూ ప్రజల విశ్వాసం పొందిందని ఆ సంస్థ ఛైర్మన్లు, బండ్లమూడి రామోహ్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వనమా నవీన్‌కుమార్, డైరెక్టర్లు వనమా సుధాకర్ అన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, తదితరులు షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.