Share News

Minister Keshav: ఆరు నెలల్లోనే ఉరవకొండకు తాగునీరిచ్చాం

ABN , Publish Date - Jul 08 , 2025 | 06:21 AM

ఎన్నికల హామీ మేరకు ఉరవకొండ పట్టణ తాగునీటి సమస్యను ఆరు నెలల్లోనే పరిష్కరించామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ చెప్పారు. ఒక పథకాన్ని చేపట్టి ఇంత తక్కువ కాలంలో పూర్తి చేయడం రికార్డు అని అన్నారు.

 Minister Keshav: ఆరు నెలల్లోనే ఉరవకొండకు తాగునీరిచ్చాం

  • ఎన్నికల హామీని నెరవేర్చాం: పయ్యావుల కేశవ్‌

  • 16 కోట్లతో చేపట్టిన పథకం ప్రారంభం

ఉరవకొండ, జూలై 7(ఆంధ్రజ్యోతి): ఎన్నికల హామీ మేరకు ఉరవకొండ పట్టణ తాగునీటి సమస్యను ఆరు నెలల్లోనే పరిష్కరించామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ చెప్పారు. ఒక పథకాన్ని చేపట్టి ఇంత తక్కువ కాలంలో పూర్తి చేయడం రికార్డు అని అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఆర్‌డబ్య్లూఎస్‌ కార్యాలయంలో జలజీవన్‌ మిషన్‌ కింద రూ.16 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. పంప్‌హౌ్‌సలో మోటారు ఆన్‌ చేసి, పట్టణానికి నీటిని విడుదల చేశారు. కూడేరు మండలం ఉదిరిపికొండ నుంచి ఉరవకొండకు తాగునీటిని తరలించేలా దీనిని నిర్మించారు. అంతకు ముందు పీఏబీఆర్‌ పంప్‌ హౌస్‌లో మోటారును ఆన్‌ చేసి, ఈ పథకానికి నీటిని విడుదల చేశారు. నీటి శుద్ధి ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ హయాంలో తాగునీటి పథకం నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. ఉరవకొండ తాగునీటి పథకానికి పూర్తి స్థాయిలో నీరు రావడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని అన్నారు. గతంలో ఉరవకొండకు 15 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని, ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క మీటరు పైప్‌లైన్‌ కూడా వేయలేక పోయారని విమర్శించారు. పైప్‌లైన్‌ నిర్మాణానికి అనుమతులు, ప్రణాళికలు సిద్ధం చేసినా, పూర్తి చేయలేకపోయిన అసమర్థుడు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అని విమర్శించారు. ఉరవకొండకు మరో 30 ఏళ్లవరకూ తాగునీటి సమస్య లేకుండా చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో పరిశుభ్రతపై దృష్టిపెడతామని తెలిపారు.

Updated Date - Jul 08 , 2025 | 06:22 AM