Vidya Cheating: వైసీపీ నేతల అండతో తిరుపతిలో విద్య అక్రమాలు, 18 కోట్ల మేర మోసాలు!
ABN , Publish Date - Oct 11 , 2025 | 09:37 AM
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతల అండతో తిరుపతి జిల్లాలో విద్య అనే మహిళ రెచ్చిపోయింది. తిరుపతి నగరం సహా జిల్లా వాసుల్ని 18 కోట్లకు మోసం చేసింది. ఇప్పుడు బాధితులు..
తిరుపతి, అక్టోబర్ 11: వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతల అండతో తిరుపతి జిల్లాలో విద్య అనే మహిళ రెచ్చిపోయింది. తిరుపతి నగరం సహా జిల్లా వాసుల్ని రూ.18 కోట్లకు మోసం చేసింది. ఇప్పుడు బాధితులు నిర్భయంగా ముందుకొచ్చి విద్య మోసాలపై పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటి వరకూ విద్యపై ఒక్క తిరుపతి నగరంలోనే 6 కేసులు నమోదయ్యాయి.
అధిక వడ్డీ ఇస్తానని, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి, తక్కువ ధరకు బంగారం.. ఇలా వివిధ రకాల మాయమాటలు చెప్పి 2020 నుండి తిరుపతి జిల్లా వాసుల్ని బుట్టలో వేసుకుంది విద్య. విద్య చేతిలో మోసపోయిన బాధితులలో 10 మంది పోలీసు సిబ్బంది ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది.
వైసీపీ నాయకుల అండదండలతో తిరుపతి జిల్లాలో అప్పట్లో రెచ్చిపోయిన విద్య.. ఆపార్టీ హయాంలో తాను ఆడిందే ఆటగా చెలామణీ అయింది. ఇప్పుడు వైసీపీ అధికారంలో లేకపోవడంతో.. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ గోడు వెల్లబోసుకుంటూ, తమకు జరిగిన అన్యాయంపై పోలీసు కేసులు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో విద్యపై ఈస్ట్, అలిపిరి, సీసీఎస్ పిఎస్‌లలో 6 కేసులు నమోదయ్యాయి. పాత కేసుకు సంబంధించి బెయిల్‌పై ఉంటూ తప్పించుకు తిరుగుతున్న విద్య.. ఇప్పుడు హైదరాబాద్ పటాన్ చెరువులో ఉన్నట్టు సమాచారం అందడంతో బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసు ఉన్నతాధికారుల దగ్గర మొరపెట్టుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు
Read Latest Telangana News and National News