Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..వీఐపీ బ్రేకు దర్శనాల్లో మార్పులు..
ABN , Publish Date - Apr 27 , 2025 | 09:28 PM
Tirumala: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చే సాధారణ భక్తులకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశ్యంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో కీలక మార్పులు తీసుకురాబోతోంది.

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రపంచం నలుమూలలనుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ భక్తులకు ప్రాధాన్యత కల్పించాలని భావించింది. సామాన్య భక్తులకు సర్వ దర్శనం కల్పించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు బ్రేక్ వేసి.. ఎక్కువ సమయం సామాన్య భక్తులకు కేటాయించాలని అనుకుంటోంది.
ఈ నిర్ణయంలో భాగంగానే వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో కీలక మార్పులు తీసుకురాబోతోంది. ఈ మేరకు టెస్ట్ ట్రైల్ నిర్వహించనుంది. మే నెల ప్రారంభం నుంచి రెండున్నర నెలల పాటు ఈ టెస్ట్ ట్రైల్ సాగనుంది. శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే మే ఒకటి నుండి జూలై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేయాలని టీటీడీ నిర్ణయించింది. స్వయంగా వచ్చే వీఐపీలను మాత్రమే ప్రోటోకాల్ వీఐపీలుగా పరిగణించి శ్రీవారి దర్శనం కల్పించనుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రయోగాత్మకంగా ఉదయం 6 గంటల నుండి అమలు చేయనుంది.
ఇవి కూడా చదవండి
స్కూలు బాలికలతో తప్పుడు ప్రవర్తన.. చావగొట్టిన జనం..
Nani: బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేసిన హీరో నాని