Telugu Youth Request: సైబర్ ముఠా చేతుల్లో తెలుగు యువకులు.. డిప్యూటీ సీఎం పవన్‌కు విజ్ఞప్తి
ABN , Publish Date - Aug 01 , 2025 | 02:58 PM
Telugu Youth Request: తమను కాపాడాలంటూ థాయ్‌లాండ్‌లో చిక్కుకుపోయిన తెలుగు యువకులు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో సందేశం పంపారు.

ఉద్యోగాల కోసం థాయ్‌లాండ్ వెళ్లిన తెలుగు యువకులకు ఊహించని షాక్ తగిలింది. సైబర్ నేరగాళ్లు వారిని నమ్మించి మోసం చేశారు. ఉద్యోగాలంటూ తీసుకెళ్లి సైబర్ నేరాలకు పాల్పడాలంటూ వేధిస్తున్నారు. వారి ఆదేశాలను తిరస్కరించినా, ఎదురు ప్రశ్నించినా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. రోజుకు 16 నుంచి 20 గంటలపాటు పని చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఆడవాళ్ల గొంతుతో సైబర్ నేరాలకు పాల్పడాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇంగ్లీష్ రాదు, చాటింగ్ చేయలేమని చెప్పిన ఓ యువకుడిపై ఇనుప హాకీ స్టిక్‌తో దాడి చేశారు.
విచక్షణా రహింతంగా కొట్టారు. సైబర్ ముఠా నుంచి పారిపోలేని పరిస్థితిలో వారంతా బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమను కాపాడాలంటూ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో సందేశం పంపారు. ఆ వీడియోలో తమ బాధనంతా చెప్పుకున్నారు. ‘అన్నా నువ్వే మమ్మల్ని కాపాడాలి’ అంటూ ప్రాధేయపడ్డారు. తమను సురక్షితంగా కుటుంబసభ్యుల దగ్గరకు చేర్చాలని కోరారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
అత్యాచారం కేసులో మాజీ ఎంపీ రేవణ్ణను దోషిగా తేల్చిన కోర్టు
ఈ వంటమనిషికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా సాటిరాలేరు.. మహిళా లాయర్ పోస్టు వైరల్