Share News

Teachers Protests: టీచర్లకు బోధనేతర కార్యక్రమాలు రద్దు చేయాలి

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:36 AM

టీచర్ల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) శనివారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసింది.

Teachers Protests: టీచర్లకు బోధనేతర కార్యక్రమాలు రద్దు చేయాలి

  • రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాప్టో ధర్నాలు.. కలెక్టర్లకు వినతిపత్రాలు

అమరావతి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): టీచర్ల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) శనివారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసింది. టీచర్లకు బోధనేతర కార్యక్రమాలు పూర్తిగా రద్దు చేయాలని, 12వ పీఆర్సీ అమలు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. ఫ్యాప్టో చైర్మన్‌ ఎల్‌. సాయి శ్రీనివాస్‌ గోదావరి జిల్లాల్లో, సెక్రటరీ జనరల్‌ ఎస్‌.చిరంజీవి తిరుపతిలో నిర్వహించిన ధర్నాల్లో పాల్గొన్నారు. టీచర్లకు ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ అమలుచేయాలని, ఎంఈవో-1 పోస్టుల భర్తీకి ఉమ్మడి సీనియారిటీ ప్రామాణికంగా తీసుకోవాలని, 30శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న 3 డీఏలు విడుదల చేయాలని, ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ప్రయోజనాల నగదు ఇవ్వాలని, డీఎస్సీ-2003 టీచర్లకు పాత పెన్షన్‌ స్కీం వర్తింపజేయాలని కోరారు. ఈ ధర్నాల్లో అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పెద్దఎత్తున టీచర్లు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 05:37 AM