Share News

TDP Andaman: అండమాన్ దీవుల్లోనూ టీడీపీ కూటమి జయకేతనం

ABN , Publish Date - Apr 24 , 2025 | 06:32 PM

తెలుగు రాష్ట్రాలకు వెలుపల కూడా తెలుగుదేశం పార్టీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అండమాన్‌- నికోబార్‌ లోని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ పదవికి జరిగిన ఎన్నికలో..

TDP Andaman: అండమాన్ దీవుల్లోనూ టీడీపీ కూటమి జయకేతనం
Andaman Muncipal election

Andaman Muncipal election: ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని అని కవి చెప్పినట్టు తెలుగువాడి ఆత్మగౌరవంతో మొదలైన తెలుగుదేశం పార్టీ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మన దీవులైన అండమాన్, నికోబార్ లోనూ తన సత్తా చాటుతోంది. తెలుగు రాష్ట్రాలకు వెలుపల కూడా తెలుగుదేశం పార్టీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అండమాన్‌- నికోబార్‌ లోని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ పదవికి జరిగిన ఎన్నికలో బీజీపీ మద్దతుతో టీడీపీ అభ్యర్థి షాహుల్ హమీద్ విజయం సాధించారు. టీడీపీ-బీజేపీ ఐక్యతకు ఈ గెలుపు ఒక నిదర్శనం. ఇక, పోర్ట్‌ బ్లెయిర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి టీడీపీకి చెందిన మహిళా కార్పొరేటర్‌ సెల్వికి దక్కింది.

ఇవాళ దక్షిణ అండమాన్ లోని శ్రీ విజయపురం మున్సిపల్ కౌన్సిల్ (svpmc)చైర్ పర్సన్ ఎన్నికలు ఇవాళ జరిగాయి. ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్. షాహుల్ హమీద్ ఎన్నికయ్యారు. ఆయన బీజేపీ+టీడీపీ కూటమి అభ్యర్థిగా ఈ ఎన్నికలో పోటీ చేశారు. ఈ ఎన్నిక నేడు (24 ఏప్రిల్ 2025న), అండమాన్ & నికోబార్ యూనియన్ టెరిటరీలోని దక్షిణ అండమాన్‌లోని SVPMC కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగింది. ఈ ఎన్నికలో ఎస్.షాహుల్ హమీద్ 24 ఓట్లలో 15 ఓట్లు సాధించారు. ప్రస్తుత చైర్‌పర్సన్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన సుదీప్ రాయ్ శర్మను షాహుల్ హమీద్ ఓడించారు. సుదీప్ రాయ్ శర్మకు 9 మంది సభ్యుల మద్దతు దక్కింది. ఈ విజయంతో ఎస్. షాహుల్ హమీద్ అండమాన్ & నికోబార్ దీవుల చరిత్రలో SVPMC చైర్‌పర్సన్‌గా నియమితులైన రెండవ టీడీపీ అభ్యర్థి అయ్యారు.


ఇవి కూడా చదవండి..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 24 , 2025 | 06:32 PM