Share News

Guntur Tragic Incident: చిన్నారి గొంతు కొరికి చంపిన వీధి కుక్క

ABN , Publish Date - Apr 07 , 2025 | 04:11 AM

గుంటూరులో నాలుగేళ్ల బాలుడు ఐజాక్‌ను వీధి కుక్క దాడి చేసి గొంతు కొరికి చంపేసింది. ఇది ఐద్వానగర్‌లో జరిగింది; స్థానికులు వచ్చి కుక్కను తరిమినా, బాలుడు ఆసుపత్రిలో మృతిచెందాడు

Guntur Tragic Incident: చిన్నారి గొంతు కొరికి చంపిన వీధి కుక్క

గుంటూరులో ఘోరం

గుంటూరు, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): గుంటూరులో ఘోరం జరిగింది. ఓ వీధి కుక్క నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసి, గొంతు కొరికి చంపేసింది. నల్లపాడు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఐద్వానగర్‌కు చెందిన కొమ్మగాని నాగరాజు, రాణి దంపతులకు ముగ్గురు కుమారులు. ఆదివారం వీరు పిల్లలతో కలిసి మందిరానికి ప్రార్థనకు వెళ్లి వచ్చారు. తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలతో ఇంట్లోకెళ్లగా.. చిన్న కుమారుడైన ఐజాక్‌ (4) ఇంటి ముందు రోడ్డుపై ఆడుకుంటున్నాడు. కొద్ది సమయానికి అటుగా వచ్చిన వీధి కుక్క ఒక్కసారిగా ఐజాక్‌పైకి దూకింది. మెడ కొరికి తీసుకెళ్తుండగా.. బాలుడు పెద్దగా ఏడవడంతో స్థానికులు గమనించి, కుక్కపైకి రాళ్లు విసిరారు. దీంతో కుక్క బాలుడిని వదిలి పరిగెత్తింది. అప్పటికే తీవ్ర గాయాలైన ఐజాక్‌ను తల్లిదండ్రులు హుటాహుటిన జీజీహెచ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఐజాక్‌ మృతిచెందినట్లు చెప్పారు.

Updated Date - Apr 07 , 2025 | 04:15 AM