పోలీసులు తాటతీస్తారు: ఎమ్మెల్యే సోమిరెడ్డి
ABN , Publish Date - Jun 20 , 2025 | 05:24 AM
చట్టాలు ఎవరికీ చుట్టాలు కాదు. నువ్వు, నీ రౌడీ మూకలు బరితెగించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే పోలీసు శాఖ చూస్తూ ఊరుకోదు... తాటతీస్తుంది అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జగన్‌ను హెచ్చరించారు.

‘చట్టాలు ఎవరికీ చుట్టాలు కాదు. నువ్వు, నీ రౌడీ మూకలు బరితెగించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే పోలీసు శాఖ చూస్తూ ఊరుకోదు... తాటతీస్తుంది’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జగన్‌ను హెచ్చరించారు. ‘బెట్టింగ్ ఆడి రూ.కోట్లు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబ పరామర్శలో బరితెగించి ప్రదర్శన చేయడం సిగ్గుచేటు. బెట్టింగ్‌లు ఆడి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహాం ఏర్పాటు చేస్తే అతన్ని ఆదర్శంగా తీసుకోవాలా? నీకు విలువల్లేవా? జగన్ పాలనలో రాష్ట్రం బిహార్‌ను తలపించింది’ అని సోమిరెడ్డి విమర్శించారు. కాగా, ‘ప్రజాస్వామ్యం, శాంతియుతంగా జీవించడానికి. రప్పా రప్పా నరకడానికి కాదు’ అని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ జగన్‌పై మండిపడ్డారు.