Share News

Bail Petition: సజ్జల ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

ABN , Publish Date - Jun 17 , 2025 | 05:39 AM

సంకరజాతి తెగ అంటూ రాజధాని ప్రాంత ప్రజల ను ఉద్దేశించి అను చిత వ్యాఖ్యలు చేసిన విషయంలో అమరావతి రాజధా ని రైతు దళిత జేఏసీ నాయకురాలు కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు వ్యవహారంలో తనకు ముందస్తు బెయిల్‌...

 Bail Petition: సజ్జల ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

అమరావతి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): సంకరజాతి తెగ అంటూ రాజధాని ప్రాంత ప్రజల ను ఉద్దేశించి అను చిత వ్యాఖ్యలు చేసిన విషయంలో అమరావతి రాజధా ని రైతు దళిత జేఏసీ నాయకురాలు కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు వ్యవహారంలో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వేసిన వ్యాజ్యంపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఈ పిటి షన్‌ సోమవారం విచారణకు రాగా, సజ్జల తరఫున న్యాయవాది దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇదే వ్యవహారంపై శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారని, దాని ఆధారంగా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేశారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారా యణ వాదనలు వినిపిస్తూ.. ఈ ఫిర్యాదు ఆధారంగా ఇప్పటివరకు ఎలాంటి కేసూ నమోదు కాలేదని తెలిపారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లి కార్జునరావు పూర్తి వివరాలు తమ ముందు ఉంచా లని ఆదేశించారు.

Updated Date - Jun 17 , 2025 | 05:42 AM