Share News

Sullurupeta Police To Posani: 15న విచారణకు రండి

ABN , Publish Date - Apr 09 , 2025 | 04:48 AM

సినీనటుడు పోసాని కృష్ణమురళికి సూళ్లూరుపేటలో నమోదైన కేసు నేపథ్యంలో పోలీసులు విచారణకు హాజరుకావాలని 15న నోటీసులు ఇచ్చారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఘటనకు సంబంధించిన విచారణ ఇది

 Sullurupeta Police To Posani: 15న విచారణకు రండి

  • పోసానికి సూళ్లూరుపేట పోలీసుల నోటీసులు

తడ, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): సినీనటుడు పోసాని కృష్ణమురళికి పోలీసుల నుంచి మరోసారి పిలుపు వచ్చింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో నమోదైన కేసుకు సంబంధించి 15న విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆయనకు నోటీసులిచ్చారు. ఉదయం 11 గంటలకు సూళ్లూరుపేటలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌ నాయుడి నియామకాన్ని వ్యతిరేకిస్తూ పోసాని అసభ్య పదజాలంతో దూషించారు.

Updated Date - Apr 09 , 2025 | 04:51 AM